Skip to main content

APPSC Group-1 Ranker Nimmanapalli Manoj Reddy Succes : డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కొట్టానిలా.. ఎప్ప‌టికైనా నా ల‌క్ష్యం ఇదే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రూప్‌-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశ‌లు ఎట్ట‌కేల‌కు ఫ‌లించాయి. ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్‌ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి.. ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను విడుద‌ల చేసింది. 2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.
నిమ్మనపల్లి మనోజ్‌రెడ్డి, ఏపీపీఎస్సీ  గ్రూప్‌-1 ఆరో ర్యాంకర్‌
నిమ్మనపల్లి మనోజ్‌రెడ్డి, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఆరో ర్యాంకర్‌

ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో ఫ‌లితాల్లో 6వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికైన నిమ్మనపల్లి మనోజ్‌రెడ్డి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

ఎప్ప‌టికైనా నా ల‌క్ష్యం ఇదే..
మాది అన్నమయ్య జిల్లా రాయచోటి. ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చేశా. అమ్మానాన్న సహదేవ రెడ్డి, కళావతి బోధన రంగంలో ఉన్నారు. 2022 సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించా. మెయిన్స్‌ను రాయడానికి సిద్ధమవుతున్నా. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. అలాగే ఎప్ప‌టికైనా నా ల‌క్ష్యం సివిల్స్ సాధించ‌డ‌మే..

Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..

1,14,473 మంది అభ్యర్థులు పోటీప‌డ‌గా..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్‌ విధానంలో చేశారు. 2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్‌ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.

☛ Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

☛ Success Story: ఎలాంటి కోచించి లేకుండానే.. సివిల్స్‌లో 74వ‌ ర్యాంక్ కొట్టానిలా..

☛ Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

☛ UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

☛ Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే.. 

☛ IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Published date : 16 Jul 2022 01:29PM

Photo Stories