Skip to main content

AP Deputy Collector Jobs 2023 : కొత్తగా 44 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు.. వీరికి మాత్ర‌మే.

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం ఎప్పటికప్పుడు కొత్త పోస్టుల మంజూరుతో ముందుకు వెళ్లుతుంది. రాష్ట్రంలో 44 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ అక్టోబ‌ర్ 31వ తేదీన‌ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ap deputy collector jobs 2023 news telugu
ap deputy collector jobs 2023

డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందినవారిలో ఆసక్తి ఉన్నవారికి సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు కింద పనిచేసే అవకాశాన్ని కల్పిస్తారు. ప్రస్తుతం పదోన్నతులు పొందినవారంతా 2009 బ్యాచ్‌కు చెందినవారు. 

ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్నవారిలో జనవరి నుంచి 20మంది ఉద్యోగవిరమణ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి కూడా త్వరలో డిపార్టుమెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశమై అర్హులతో కొత్త జాబితాను ఖరారు చేయనుంది. ఈ మేరకు ఏర్పడే ఖాళీలను బట్టి పోస్టింగులు ఇవ్వనున్నారు. ఈ మేర‌కు జిల్లాల్లో తహసీల్దార్లుగా పనిచేస్తున్నవారిని వెంటనే రిలీవ్‌ చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదేశించారు

6 నెలల కాలంలోనే ప్రభుత్వం 107 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుల్ని..
కొత్త పోస్టుల మంజూరుతో వీఆర్‌ఏల నుంచి తహశీల్దార్ల వరకు పదో­న్నతులు దక్కుతున్నాయి. తాజాగా రెవెన్యూ శాఖలో కొత్తగా 44 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నంబర్‌ 973 జారీ చేసింది. దీంతో అతి త్వరలో రాష్ట్రంలో 44 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించనుంది. ఆరు నెలల క్రితం కూడా 63 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు 63 మంది తహశీల్దార్లు పదోన్నతి పొందారు. వీరంతా ఆయా శాఖల్లో పనిచేస్తున్నారు. అంటే.. 6 నెలల కాలంలోనే ప్రభుత్వం 107 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుల్ని మంజూరు చేసింది. పోస్టులను మంజూరు చేయడంతోపాటు పదోన్నతుల అంశంలో ఇదొక రికార్డుని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారుల అవసరం ఎక్కువ ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల అవసరం ఉందని, వారిని తమకు డిప్యుటేషన్‌పై పంపించాలని వివిధ శాఖలు గత ప్రభుత్వాన్ని కోరాయి. అదే సమయంలో చాలామంది అధికారులు పదవీ విరమణ చేయడంతో డిప్యూటీ కలెక్టర్ల కొరత ఇంకా ఎక్కువైంది. దీంతో రెవెన్యూ శాఖ గత ప్రభుత్వాన్ని పదే పదే కోరడంతో నామమాత్రంగా కొన్ని పోస్టులు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. దీంతో ఆయా శాఖల్లో అవసరాల మేరకు అధికారులు లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

వేలాది పోస్టుల మంజూరుతోపాటు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విడతల వారీగా 370 తహశీల్దార్‌ పోస్టులు కొత్తగా మంజూరయ్యాయి. దీంతో అంతే సంఖ్యలో డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. అలాగే వెయ్యి మందికిపైగా సీనియర్‌ అసిసెంట్లు.. డిప్యూటీ తహశీల్దార్లు అయ్యారు. అదేవిధంగా 670 మంది కంప్యూటర్‌ అసిస్టెంట్లను రెవెన్యూ శాఖలో కొత్తగా నియమించారు. సీనియర్‌ అసిస్టెంట్ల కోసం నిర్వహించిన పదోన్నతుల్లో వీఆర్‌వోలకు 40 శాతం కేటాయించడంతో వేలాది మంది వీఆర్‌వోలకు లబ్ధి చేకూరింది. 

3,600 మంది వీఆర్‌వోలుగా.. 
అలాగే ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో 3,600 మంది వీఆర్‌ఏలు వీఆర్‌వోలు అయ్యారు. సర్వే సెటిల్‌మెంట్, భూరికార్డుల శాఖలోనూ 30 ఏళ్ల తర్వాత అవకాశం కల్పించడంతో వందలాది మందికి లబ్ధి కలిగింది. కొత్త పోస్టుల మంజూరు, పదోన్నతుల విషయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా రెవెన్యూ శాఖను ప్రభుత్వం బలోపేతం చేసింది. 

త్వ‌ర‌లోనే గ్రూప్‌-1 & 2 ఉద్యోగాల‌కు..

appsc group 1 jobs news telugu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం ఎప్పటికప్పుడు కొత్త పోస్టుల మంజూరుతో ముందుకు వెళ్లుతుంది. అలాగే ఇటు నిరుద్యోగుల‌కు.. అటు ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం బాస‌ట‌గా నిలుస్తూ వ‌స్తుంది. రికార్డు స్థాయిలో రెండు సార్లు గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చి.. ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేసిన విష‌యం తెల్సిందే. అలాగే ఏ క్షణంలోనైన 950 గ్రూప్‌-2 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. మ‌రో సారి దాదాపు 100 వ‌ర‌కు గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

Published date : 01 Nov 2023 03:25PM

Photo Stories