TSPSC Group 1 Prelims Question Paper & Key : ఈ సారి గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం కోడ్ ఇలా.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో కొశ్చన్ పేపర్ & కీ..
ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో పరీక్ష నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది.
TSPSC: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో బయోమెట్రిక్ హాజరు.. అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
ఈ పరీక్షకు 3.8 లక్షల మంది..
ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 16వ తేదీ (ఆదివారం) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు 3.8 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, ఇప్పటికే 2.8 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు.
☛ టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్
సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో కొశ్చన్ పేపర్ & కీ..!
ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నారు. ఈ పరీక్ష ముగిసిన తర్వాత సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వెబ్‌సైట్ గ్రూప్-1 ప్రిలిమ్స్ కొశ్చన్ పేపర్ & కీ అందుబాటులో ఉంటుంది. ఈ కీ కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే కీ మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
☛ టీఎస్‌పీఎస్సీ → ప్రివియస్ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్
ఈసారి ప్రశ్నపత్రం కోడ్ ఇలా..
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం కోడ్ ఇది వరకు ఏ, బీ, సీ, డీగా ఉండేది. ఇప్పుడు ఆరు అంకెల కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో అభ్యర్థులు ప్రశ్న పత్రం కోడ్‌ను ఆరు అంకెలను నిర్దేశించిన సర్కిళ్లలో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానంతో కాపీయింగ్‌కు ఆస్కారం ఉండదని కమిషన్ భావిస్తోంది.
TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం, ప్రిపరేషన్.. ఇలా
ప్రాథమిక కీ ని ఎప్పుడు విడుదల చేస్తారంటే..?
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీని మూడు రోజుల్లో విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది.