TSPSC: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో బయోమెట్రిక్ హాజరు.. అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శ కతతో పరీక్ష నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులోభాగంగా అన్ని జిల్లాల కలెక్ట ర్లతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి, కమిషన్ సభ్యులు రమావత్ ధన్‌సింగ్, కోట్ల అరుణకుమారి, బి.లింగారెడ్డి, సుమిత్ర ఆనంద్, రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్, సత్య నారాయణలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్లతోపాటు ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఆర్డీఓలు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ Group I ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో భాగంగా అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తు న్నట్లు వెల్లడించారు. ప్రతి అభ్యర్థి వేలిముద్రలు ఇచ్చాక కేంద్రంలోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ తరహా విధానాన్ని అమలు చేయడం ఇదే తొలిసారి అన్నారు. అక్టోబర్ 16న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు3.8 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, ఇప్పటికే 2.8 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. అభ్య ర్థులను పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే (ఉదయం 8.30గంటలు) అనుమతిస్తా మని చెప్పారు. ఉదయం 10.15 గంటలకు గేట్లు మూసి వేస్తామని, ఆ తర్వాత అభ్యర్థులను అను మతించబోమన్నారు. ఒక్కో అభ్యర్థి బయోమెట్రిక్ సమర్పణకు గరిష్టంగా 15 సెకన్లు పడుతుందని, అందువల్ల ముందుగా పరీక్ష కేంద్రానికి వస్తే ఎలాంటి ఆందోళన ఉండదని చెప్పారు.
☛ టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్
ప్రశ్నపత్రంలో ఆరు అంకెల కోడ్
Group I ప్రశ్నపత్రం కోడ్ ఇదివరకు ఏ, బీ, సీ, డీగా ఉండేది. ఇప్పుడు ఆరు అంకెల కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో అభ్యర్థులు ప్రశ్న పత్రం కోడ్‌ను ఆరు అంకెలను నిర్దేశించిన సర్కి ళ్లలో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానంతో కాపీయింగ్‌కు ఆస్కారం ఉండదని కమిషన్ భావి స్తోంది. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. దివ్యాంగులైన అభ్యర్థులు హియరింగ్ పరికరాలను తీసుకురావాలంటే డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. అదేవిధంగా దివ్యాంగులైన అభ్యర్థులు సంబంధిత అధికా రులు జారీ చేసిన సర్టిఫికెట్లను వైకల్యశాతం స్పష్టంగా కనిపించేలా తీసుకురావాలని సూచించింది. పరీక్ష కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను కమిషన్ ఆదేశించింది. అదేవిధంగా పరీక్ష కేంద్రానికి అభ్య ర్థులు చేరుకునేందుకు వీలుగా రవాణా వ్యవస్థను నిర్దేశించిన సమయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
☛ టీఎస్‌పీఎస్సీ → ప్రివియస్ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్
గోడ గడియారాలు కూడా ఉండవ్...
Group I పరీక్ష ప్రాథమిక కీని మూడు రోజుల్లో విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఓటీఆర్ సమయంలో, దరఖాస్తు సమయంలో అభ్యర్థులు పూర్తి వివరాలను సమర్పించకపోవడంతో హాల్‌టికెట్లలో కొన్ని పొరపాట్లు రావచ్చు. అలాంటి అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ నుంచి డిక్లరేషన్ నమూనాను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలతో హాజరుకావాలి. పరీక్ష కేంద్రంలో గోడ గడియారాలు సైతం ఉండవు. దీంతో అరగంటకోసారి అలర్ట్ బెల్ మోగేలా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేలా ఏర్పాటు చేసింది.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
✔ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 10.15 గంటలకే గేటు మూసివేస్తారు. అభ్యర్థులను లోపలికి అనుమతించరు.
✔ అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఏ4 సైజు పేజీపై ప్రింటు తీసుకోవాలి. కలర్ ప్రింట్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్ ప్రింట్ కాకుంటే మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాలి. లేకుంటే ఆ అభ్యర్థిని అనుమతించరు.
✔ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు ముందుగా హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలి.
✔ ప్రిలిమినరీ అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్నాకే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ప్రిలిమినరీ రాసేటపుడు తీసుకున్న బయోమెట్రిక్, మెయిన్స్‌కి వచ్చినపుడు తీసుకునే దానితో సరిపోలితేనే ప్రధాన పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
✔ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి రావాలి. బూట్లు వేసుకోకూడదు.
✔ చేతులకు, కాళ్లకు గోరింటాకు, సిరా, టాటూస్ లాంటి అలంకరణలు ఉండకూడదు, ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు.
✔ ప్రశ్నపత్రం తెరవగానే అందులో 150 ప్రశ్నలు ముద్రించారా? లేదా? చూసుకోవాలి. పొరపాట్లు ఉంటే మరొకటి అడిగి తీసుకోవాలి.
✔ అభ్యర్థులు ఓఎంఆర్ పత్రంలో వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడ్, రబ్బరు వాడితే ఆ పత్రాన్ని అనర్హమైనదిగా గుర్తించి, మూల్యాంకనానికి పరిగణించరు.
✔ ప్రశ్నపత్రంపై జవాబులను ఎట్టిపరిస్థితుల్లో మార్కు చేయకూడదు. ఓఎంఆర్ షీట్లో పేర్కొన్న స్థలంలో కాకుండా ఎక్కడైనా హాల్‌టికెట్ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా, ఆ పత్రాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు.
✔ అభ్యర్థుల ఓఎంఆర్; షీట్ల డిజిటల్ ఇమేజ్ స్కానింగ్ అనంతరం డిజిటల్ ఓఎంఆర్ కాపీలను కమిషన్ తన వెబ్‌సైట్‌లో ఉంచనుంది.
✔ పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులు బయటకు వెళ్లడానికి అనుమతించరు.