Skip to main content

TGPSC Group 1 Mains Examination: గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు శుభవార్త.. పరీక్షలకు హైకోర్టు లైన్‌క్లియర్‌

TGPSC Group 1 Mains Examination   Telangana High Court ruling on Group-1 Mains Exams  Group-1 Mains Exams date announcement  Hall tickets for Group-1 Mains Exams released  Hall tickets for Group-1 Mains Exams released  Group-1 Mains Exams notification details
TGPSC Group 1 Mains Examination

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈనెల 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ యథావిధిగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

Jobs In Doordarshan: దూరదర్శన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కాగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలకు సంబంధించి  కొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

AP TET 2024 Key Released : ఏపీ టెట్ ఆన్సర్‌ కీ విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మెయిన్స్ విద్యార్థులు నష్టపోతారన్న టీజీపీఎస్‌సీ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పిటిషన్లను విచారించిన అనంతరం డిస్మిస్‌ చేస్తూ తీర్పునిచ్చింది. పిటీషన్లను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో యథావిధిగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరగనున్నాయి. 

 

తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్‌ | TSPSC Withdraw Case In Supreme  Court Line Clear For Group-1 Exam | Sakshi

 

గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదీ.. 

సబ్జెక్టు

పరీక్ష తేదీ

జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌)

21.10.2024

పేపర్‌–1, జనరల్‌ ఎస్సే

22.10.2024

పేపర్‌–2, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ

23.10.2024

పేపర్‌–3, ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌

24.10.2024

పేపర్‌–4, ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌

25.10.2024

పేపర్‌–5, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

26.10.2024

పేపర్‌–6, తెలంగాణ మూవ్‌మెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌

27.10.2024

(అన్ని పరీక్షలకు 3 గంటల సమయం ఇస్తారు. ప్రతి పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది)

Published date : 15 Oct 2024 02:44PM

Photo Stories