TSPSC: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుంచి అడిగే ప్రశ్నలు ఇలా..!
ఇలాంటి కీలక నేపథ్యంలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుసుకుందామా...!
‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ సబ్జెక్ట్‌లో ఈ స్థాయిలోనే ప్రశ్నలు..
ఈ విభాగం నుంచి సుమారు 15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటికి సరైన సమాధానాలు ఇవ్వాలంటే.. పదో తరగతి స్థాయిలోని ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ అంశాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఇందులోనూ ఎక్కువగా సమకాలీన అంశాల కలయికగా ప్రశ్నలు అడిగే విధానం పెరిగింది. దీంతో ఈ దక్పథాన్ని కూడా అలవర్చుకోవాలి. ఇక కోర్ అంశాలకు సంబంధించి ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్,యాంత్రిక శాస్త్రం, ఉష్ణం, ద్రవ పదార్థాలు, గ్రహాలు, ఆధునిక భౌతికశాస్త్రం వంటి అంశాలు; భారత్‌లో అణుశక్తి, అంతరిక్ష విజ్ఞానం– ఇస్రో, క్షిపణులు–రక్షణ రంగంలో ఉపయోగించే వివిధ ఆయుధ వ్యవస్థలు, సమాచార–సాంకేతిక రంగం, కంప్యూటర్లు, ఇంధన వనరులు, కాలుష్యం, నానో–టెక్నాలజీ అంశాలపై ప్రత్యేక దష్టి పెట్టాలి.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మొత్తం మార్కులు: 900
సబ్జెక్ట్ | సమయం (గంటలు) | గరిష్ట మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) | 2 1/2 | 150 |
రాత పరీక్ష (మెయిన్ ) (జనరల్ ఇంగ్లిష్)(అర్హత పరీక్ష) | 3 | 150 |
మెయిన్ పేపర్–1 జనరల్ ఎస్సే
|
3 | 150 |
పేపర్–2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ
|
3 | 150 |
పేపర్–3 ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
|
3 | 150 |
పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
3 | 150 |
పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
|
3 | 150 |
పేపర్–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
3 | 150 |
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!