APPSC Group-1 Prelims: రేపు ఏపీపీఎస్‌సీ గ్రూప్–1 ప్రిలిమ్స్.. గంట ముందే చేరుకోవాలి!
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈ నెల 17న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షల కో–ఆర్డినేటింగ్ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని 33 కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 11,587 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. పరీక్ష నిర్వహణపై కమిషనర్ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రెటరీ కె.శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్లు యోగేశ్వరరావు, వెంకటరమణతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
Training for Teachers: ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుల ఐదు రోజుల శిక్షణ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహణకు కేంద్రానికి ఒకరు చొప్పున 33 మంది సీనియర్ జిల్లాస్థాయి అధికారులను లైజన్ అధికారులుగా నియమించామన్నారు. వీరు పోలీసు ఎస్కార్ట్‌తో ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలుగా ఉన్న కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.
పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటగల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుతుందన్నారు. పరీక్ష నిర్వహణలో ఏపీపీఎస్‌సీ నిబంధనలు, మార్గదర్శకాలను ప్రతి అధికారి అనుసరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకూడదని ఆదేశించారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
గంట ముందే చేరుకోవాలి
అభ్యర్థులు నిర్దేశించిన పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని పరీక్ష కో–ఆర్డినేటింగ్ అధికారి మేఘ స్వరూప్ చెప్పారు. హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదేని (ఆధార్, పాన్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, తదితర) గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోరన్నారు.
Nine Days Holidays For Schools : ఈ స్కూల్స్‌కు వరుసగా 9 రోజులు సెలవులు.. కానీ..!
Tags
- APPSC Group 1 Exam
- Prelims
- Competitive Exams
- groups exams
- appsc group-1 prelims
- collectorate office
- education officers
- Examiners
- group-1 prelims
- appsc group-1 exam schedule
- appsc prelims schedule
- APPSC News
- groups exam updates
- exam centers for group-1 prelims
- appsc group-1 prelims question paper
- previous papers of groups exams
- Education News
- Sakshi Education News
- ananthapur news
- APPSC Group-1 exams
- Examination preparations
- Anantapur Urban administration
- Group-1 Prelims Instructions
- Official communication
- sakshieducationlatest news