Covid New Variant: కోవిడ్ నుంచి వచ్చిన కొత్త వేరియంట్.. ఇది ప్రమాదకరమా?
కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1 గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో.. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే ఈ వేరియెంట్‌తో జనాలకు పెద్దగా ముప్పులేదని తెలిపింది.
Covid in Kerala: కోవిడ్-19 కి కొత్త వేరియంట్ ఇదే.. దీనిపై క్లరిటీ!
ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ప్రకారం.. జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదంలేదని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్‌తో పాటు వేర్వేరు కొవిడ్ వేరియెంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది.
జేఎన్.1 వేరియెంట్‌ను మొదటిసారి అమెరికాలో సెప్టెంబర్ నెలలో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసుల నమోదయాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15 శాతం నుంచి 29 శాతం జేఎన్.1 వేరియెంట్ కేసులేనని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేసింది. అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ ఇంతకు ముందే చెప్పింది.
వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే.. మరింత ఆందోళన కలిగించేది అని అర్థం. అంటే.. ఆ వేరియెంట్‌కు త్వరగా వ్యాప్తి చెందడం, చికిత్సకు కష్టతరం కావడం, లక్షణాలు తీవ్రంగా ఉండడం ఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ కేటగిరీలో చేర్చడం ద్వారా.. డెల్టా, ఒమిక్రాన్‌లాగా ఇది గ్రీకు భాష ద్వారా ఓ కొత్త పేరు పెట్టడానికి వీలుంటుంది. అయితే జేఎన్.1 ఈ కేటగిరీ కిందకే వచ్చినా.. ప్రాణాంతకమైంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు.
Covid Subvariant JN.1: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. దేశంలో మొదటి కేసు ఎక్కడ నమోదయ్యిందంటే..!
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు వేరియెంట్లను(ఆల్ఫా, బీటా, గామా, డెల్టా) వేరియంట్స్ ఆఫ్ కన్‌సర్న్‌గా గుర్తించింది. తర్వాతి కాలంలో విజృంభిస్తున్న వేరియెంట్లను వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీ కింద డబ్ల్యూచ్‌వో మానిటరింగ్ చేస్తూ వస్తోంది.