Skip to main content

Andhra Pradesh: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ.. కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఏప్రిల్‌ 2వ తేదీన (శనివారం) వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్‌.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది.
andhra pradesh new districts and revenue headquarters
AP New Districts and Revenue Headquarters

ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం.. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం. కొత్త జిల్లాలకు సంబంధించి కసర్తతు పూర్తైంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావచ్చు. ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరిగింది’’ అని తెలిపారు.

26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్‌ సిద్దమైంది. ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుంచి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. 

AP New Districts : కొత్త జిల్లాలు.. వీటి చ‌రిత్ర..!

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు ఇలా..

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం, 

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల 

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి. 

AP New Districts List 2022 : జిల్లాల స‌మ‌గ్ర స‌మాచారం మీకోసం..ఏ జిల్లా ప‌రిధిలో మీరు ఉన్నారంటే..?

కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య.. 

- శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు
- విజయనగరం జిల్లా.. 27 మండలాలు
- పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు
- అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు
- విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు
- అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు
- కాకినాడ జిల్లా.. 21 మండలాలు
- కోనసీమ జిల్లా.. 22 మండలాలు
- తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు
- పశ్చిమగోదావరి  జిల్లా.. 19 మండలాలు
- ఏలూరు జిల్లా.. 28 మండలాలు
- కృష్ణా జిల్లా.. 25 మండలాలు
- ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు
- గుంటూరు జిల్లా.. 18 మండలాలు
- బాపట్ల జిల్లా.. 25 మండలాలు
- పల్నాడు జిల్లా.. 28 మండలాలు
- ప్రకాశం జిల్లా.. 38 మండలాలు
- నెల్లూరు జిల్లా.. 38 మండలాలు
- కర్నూలు జిల్లా.. 26 మండలాలు
- నంద్యాల జిల్లా.. 29 మండలాలు
- అనంతపురం జిల్లా.. 31 మండలాలు
- శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు
- వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు
- అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు
- చిత్తూరు జిల్లా.. 31 మండలాలు
- తిరుపతి జిల్లా.. 34 మండలాలు

ఏప్రిల్‌ 4వ తేదీన ఉదయం 9గం.05ని నుంచి 9గం.45ని.మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర పడింది. 

కొత్తగా..
26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్‌గా ఆమోదం తెలిపింది కేబినెట్‌. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్‌ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి. 

పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్‌, గుంతకల్‌, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు.

Andhra Pradesh: నూతన జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు

​​​​​​​AP New Revenue Divisions: 63కు చేరిన రెవెన్యూ డివిజన్లు.. కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవే..

​​​​​​​1974 ఏపీ డిస్ట్రిక్ట్‌ (ఫార్మేషన్‌) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు

Published date : 02 Apr 2022 09:49PM

Photo Stories