Skip to main content

R-5 zone: అమరావతిలో ఆర్‌-5 జోన్‌.. అసలు ఆర్​-5 జోన్లు​ అంటే ఏమిటి?

అమరావతిలో విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు (స్థానికేతరులకు) ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేష‌న్​ను ఇప్ప‌టికే విడుదల చేసింది.
Amravathi

ఇందుకు గాను అమ‌రావ‌తిలో ప్రత్యేక జోన్‌(ఆర్‌-5 జోన్‌) ఏర్పాటు చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తుంది. ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని.. జీవోను వ్యతిరేకిస్తూ దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్ర‌స్తుతం ఆర్‌-5 జోన్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది.

ఆర్‌-5 జోన్లు ఇవే..
1) ఆర్‌-1 జోన్‌ అంటే.. ప్రస్తుత గ్రామాలు.
2) ఆర్‌-2 జోన్ అంటే తక్కువ సాంద్రత గ‌ల గృహాలు. 
3) ఆర్‌-3 జోన్‌ అంటే తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు.
4) ఆర్‌-4 జోన్ అంటే హైడెన్సిటీ జోన్‌ పేర్లతో నాలుగు రకాల నివాసాలు ఉండేవి.
5) ఆర్‌-4 జోన్ అంటే కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ఇటీవ‌ల ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసింది.

Andhra Pradesh Budget 2023‌-24 Highlights: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ 2023‌-24

Published date : 04 Apr 2023 01:06PM

Photo Stories