Skip to main content

Minorities security in India: భారత్‌లో మైనార్టీల‌కు భద్రత లేదా?

భారతదేశంలో మైనార్టీల హక్కులకు భంగం కలుగుతోందని అమెరికా ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌’ (యూఎస్‌సీ ఐఆర్‌ఎఫ్‌) భారత దేశ సార్వభౌమాధికా రానికి వ్యతిరేకంగా రిపోర్టులను తయారు చేసిన విషయం ఈ దేశ ప్రజలలో చాలా మందికి తెలియదు. అమెరికా మత, రాజ కీయ ప్రయోజనాలను కాపాడడం కోసం 1998లో అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఒక సలహా సంస్థే ఈ యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌.
USCIRF Report on India, Minorities security in India, Minority Rights in India, Human Rights in India
Minorities security in India

అమెరికా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, ఆగమేఘాలపై రిపోర్టులను తయారు చేసి, ఐక్యరాజ్యసమితి ముందు ప్రవేశపెట్టి, ప్రపంచంలోని సార్వభౌమాధికార దేశాలను ఇబ్బంది పెట్టడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. తాజాగా  ఐక్యరాజ్యసమితిలో ఈ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, భారత దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తదితర మైనార్టీ మతాలవారు అనేక ఇబ్బందు లను ఎదుర్కొంటున్నారనీ, వారి కనీస హక్కులకు భంగం కలిగించేలా భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.

China Serious on America: అమెరికా ద్వంద్వ వైఖరిపై చైనా గుర్రు

గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అమెరికా ఆయిల్, ఫార్మా, డిఫెన్స్‌ లాబీయింగ్‌ యధేచ్ఛగా నిర్వహించి, తన దేశ ప్రయో జనాలను నెరవేర్చుకునేది. మోదీ ప్రభుత్వంలో ఇవి సాగడం లేదు. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధాన్ని భారతదేశం తనకు అనుకూలంగా మలుచుకుని, తక్కువ ధరలకు రష్యా నుండి ఆయిల్‌ను సమ కూర్చుకోవడం, తక్కువ ధరలకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను తూర్పు ఆసియా దేశాలకు అమ్మడం, కరోనా టీకాను ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు ప్రవేశపెట్టడం ఇత్యాది విషయాలన్నీ అమెరికాకు కోపం తెప్పించేవే.

నిజంగా భారతదేశంలో మైనార్టీలు భద్రంగా లేరా అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మొదట ముస్లింల సంగతి చూద్దాం. ప్రపంచంలో ఏ దేశంలో లేని భద్రత భారతదేశంలోని ముస్లింలకు ఉంది. వారి ఓటు బ్యాంకు కోసం అన్ని రాజకీయ పార్టీలూ సాగిలపడడం మనం చూస్తూనే ఉన్నాం! ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ముస్లింలకు భద్రత కరువైందని చెప్పడం ఒక దుష్ప్రచారం. వక్రబుద్ధితో కూడిన విష ప్రచారం.

Terrorism in South Asia: దక్షిణాసియాపై ఉగ్ర పంజా

ఈ దేశంలో భద్రత లేకపోతే బర్మా, బంగ్లాదేశ్‌ల నుండి లక్షల సంఖ్యలో ముస్లింల అక్రమ వలసలు ఎందుకు జరుగుతున్నట్టు? 1947లో మతం ప్రాతి పదికగా ముస్లింలకు పాకిస్తాన్‌ ఏర్పాట య్యింది అనేది వాస్తవం కాదా? అటువంటి పాకిస్తాన్‌లో మైనారిటీలైన హిందు వుల పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి తెలియని విషయమేమీ కాదు.
ఇక క్రైస్తవుల విషయానికొస్తే – ఈశాన్య రాష్ట్రా లైన అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌ రాష్ట్రాలు క్రైస్తవ మెజార్టీ రాష్ట్రాలుగా ఎలా రూపుదిద్దుకున్నాయి? ఇక మోదీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో మతపరమైన వివక్షతలను ఎక్కడా చూపడం లేదనే విషయం స్పష్టం. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమి వేయడం, అనేక మందిని హత్య చేయడం వంటి విషయాలను ఏనాడు ప్రశ్నించని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ నిప్పు లేకుండానే పొగ ఎందుకు పెట్టింది అనే మర్మాన్ని ఈ దేశ ప్రజలు త్వరలోనే గ్రహిస్తారు.

Fundamental Rights: గాలిలో దీపాలైన ప్రాథమిక హక్కులు!

Published date : 07 Oct 2023 11:07AM

Photo Stories