EarthQuake: బిగ్ బ్రేకింగ్.... గుజరాత్‌లో భూకంపం.. రిక్టర్‌స్కేల్‌పై ఎంత నమోదైందంటే....
ఇప్పటి వరకు సుమారు 25 వేల మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే తాజాగా మనదేశంలోనూ భూకంపం సంభవించింది.
3.8 తీవ్రతతో నమోదు..!
గుజరాత్‌లో భూకంపం సంభవించింది. సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున రిక్టర్‌స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోందైందని ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ సిస్మొలాజికల్ రీసెర్చ్(ఐఎస్‌ఆర్) అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత 12.52 నిమిషాలకు భూమి కంపించినట్లు వెల్లడించారు. సూరత్‌లోని పశ్చిమ నైరుతి తీరాన 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నారు. భూకంపకేంద్రం చాలా దూరంగా ఉండడంతో ప్రకంపనలు స్వల్పంగా నమోదయ్యాయి.
చదవండి: మూత్రం తాగుతూ... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
అత్యధిక భూకంపాలు నమోదయ్యేది ఇక్కడే...!
భూ ప్రకంపనలు 5.2 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం హజీరా తీరాన అరేబియా సముద్రంలో ఏర్పడినట్లు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. గుజరాత్ అధికంగా భూకంప ప్రమాదాలను ఎదుర్కోంటోంది. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001లలో గుజరాత్‌లో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి.
చదవండి: దేశాన్నే పక్కకి జరిపిన భూకంపం... ఏకంగా 5 మీటర్లు జరిగిన టర్కీ
2001లో భారీ భూకంపం...
2001 కచ్‌లో సంభవించిన భూకంపం గత రెండు శతాబ్దాల్లో భారత్‌లో సంభవించిన మూడవ అతి పెద్ద, రెండో అత్యంత విధ్వంసక భూకంపం. ఆ సమయంలో 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు. అయితే ప్రస్తుతం భూమి కంపించడంతో పాత జ్ఞాపకాలు పునరావృతమవుతాయోమోనని గుజరాత్ ప్రజలు ఆందోళన పడుతున్నారు.