Miss Universe: ఆల్ ఫ్రీ... మిస్ యూనివర్స్‌కి ఏ సదుపాయాలు కల్పిస్తారో.. ఓ లుక్కేయండి..!
అయితే 2022 మిస్ యూనివర్స్‌గా అమెరికాకు చెందిన ఆర్‌బోనీ గాబ్రియల్ నిలిచింది. అమెరికా లూసియానాలో జరిగిన ఈ పోటీలో దాదాపు 80 మందికి పైగా పోటీ పడ్డారు.
విన్నర్ గాబ్రియల్‌కు భారత్‌కు చెందిన మాజీ విశ్వ సుందరి హర్నాజ్ సంధు ఈ కిరీటాన్ని బహుకరించారు. కాగా గడిచిన పదేళ్లలో యూఎస్‌ఏకు ఇది తొలి విజయం. ఇప్పటి వరకు తొమ్మిది మంది విశ్వసుందరి టైటిల్‌ను దక్కించుకోగా.. అత్యధిక సార్లు గెలిచిన దేశంగా యూఎస్‌ఏ రికార్డు సృష్టించింది.
అయితే మిస్ యూనివర్స్‌గా ఎంపికైతే ఏయే సదుపాయాలు కల్పిస్తారో తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలోనూ ఉంటుంది. విశ్వ సుందరిగా గెలిచిన వారికి కిరీటం బహూకరిస్తారు. కిరీటాన్ని ది పవర్ ఆఫ్ యూనిటీగా పిలుస్తారు. సుమారు 18 క్యారెట్ల బంగారం తో ఉంటుంది. అలాగే 1725 తెలుపు వజ్రాలు, 3 గోల్డెన్ కెనరీ డైమండ్స్ ఈ కిరీటం లో ఉంటాయి.
అలాగే కిరీటం మధ్య లో బంగారపు షీల్డ్‌తో రూపొందించిన డైమండ్ ఉంటుంది. దీని బరువు దాదాపు 62.83 క్యారట్లు ఉంటుంది. మొత్తం కిరీటం విలువ మన కరెన్సీ లో రూ. 38 కోట్ల వరకు ఉంటుంది. ఈ కిరీటాన్ని ఎవరికీ పూర్తిగా ఇవ్వరు. ప్రతీ ఏడాది గెలిచిన వారికి మాజీ విన్నర్ దీన్ని బహూకరిస్తుంటారు.
మిస్ యూనివర్స్ గా గెలిచిన వారికి సుమారు రూ.2 కోట్ల ఫ్రై జ్ మనీ అందిస్తారు. విన్నర్‌గా గెలిచిన వారికి న్యూయర్క్ నగరంలో మిస్ యూనివర్స్ అపార్ట్‌మెంట్స్‌లో ఏడాది పాటు ఉచిత నివాస సౌకర్యం ఉంటుంది. అపార్ట్‌మెంట్‌లో నివశించే సమయంలో వంటలకు ఉపయోగించే కూరగాయల నుంచి... ధరించే దుస్తుల వరకు అన్నీ ఫ్రీగానే అందజేస్తారు.
అలాగే విశ్వసుందరి అందానికి మెరుగులు దిద్దేందుకు, ఆమె మేకప్ కోసం ప్రత్యేకంగా మేకప్ బృందం ఉంటుంది. మేకప్ సామాగ్రీని కూడా ఏడాది పాటు ఉచితంగా అందిస్తారు. మిస్ యూనివర్స్ మోడలింగ్ చేయాలనుకుంటే వారికి ప్రత్యేకంగా ఫొటో గ్రాఫర్‌లను నియమిస్తారు.
ఫొటో షూట్స్ ఉచితం. ఈ ఫొటోలనే సినీ నిర్మాతలకు, ప్రొడక్షన్ హౌజ్‌లకు పంపించుకోవచ్చు. అలాగే ఏడాది పాటు ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించొచ్చు. ఉండడానికి, తిరగడానికి, తినడానికి... ఇలా అన్నీ ఫ్రీనే. అలాగే ముఖ్యమైన సినీ ఈవెంట్లు, ప్రోగ్రాములన్నింటికి ఇన్విటేషన్ లభిస్తుంది. అయితే మిస్‌యూనివర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఏడాది పాటు ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈవెంట్లన్నింటికీ హాజరుకావాల్సి ఉంటుంది.