Longest Glass Bridge In World: ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన.. ఎక్కడుందంటే..
ప్రపంచంలో రకరకాల వంతెనలు ఉన్నాయి. వీటిలోని కొన్నింటిపై నడవాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి పెద్ద గాజు వంతెన గురించి తెలుసుకుందాం. వియత్నాంలోని ‘బాక్ లాంగ్ బ్రిడ్జ్’ ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా పేరొందింది. ప్రపంచంలోని నలుమూలల పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ వంతెన ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ బ్రిడ్జిని ‘వైట్ డ్రాగన్’ అని కూడా అంటారు. ఎత్తయిన ప్రదేశాల్లో నడవాలంటే భయపడేవారు ఈ వంతెనపై వెళ్లడం పెద్ద సాహసమే. ఈ వంతెన కింది భాగం గాజుతో తయారయ్యింది. దీని మీద నడిచేవారు కిందికి చూస్తే భయపడటం ఖాయం. ఈ వంతెన పొడవు 632 మీటర్లు అంటే దాదాపు 2,073 అడుగులు.
దీని ఎత్తు 150 మీటర్లు అంటే 492 అడుగులు. బ్రిడ్జి ఫ్లోర్‌ను ప్రత్యేకమైన టెంపర్డ్ గ్లాస్‌తో తయారు చేశారు. ఇది చాలా బలంగా ఉంటుంది. ఈ గాజు వంతెనపై ఒకేసారి 450 మంది నడిచేందుకు అవకాశం ఉంది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో 526 మీటర్ల పొడవైన ఈ గ్లాస్ బాటమ్ బ్రిడ్జ్ ఉంది.
కాగా భారతదేశంలోని బీహార్‌లోని రాజ్‌గిర్‌లోనూ ఒక గాజు వంతెన ఉంది. ఈ వంతెనపై నడిచిన పర్యాటకుడు మీడియాతో మాట్లాడుతూ ఈ గ్లాస్ బ్రిడ్జిపై నడుస్తున్నప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుందని, కాళ్ల కింద అంతా స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ గాజు కారణంగా ప్రకృతి అందాలను చూడగలుగుతున్నామన్నారు.