Skip to main content

San Marino: ఆరు నెలలకు ఒక‌సారి ఎన్నికలు జ‌రిగే దేశం ఎక్క‌డ ఉందో తెలుసా!

మనదేశంలో ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ దేశంలో మాత్రం ఎన్నికలు ఆరునెలలకు ఒకసారి! ఏమిటా దేశం? ఎక్కడుంది? పనిలో పనిగా మొదటిసారి అక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగాయో కూడా తెలుసుకుందామా?
European Democracy, San Marino  Election,  San Marino's Biannual Elections,San Marino Population
San Marino

ప్రతి ఆరునెలలకు ఎన్నికలు జరిగే దేశం యూరప్‌ ఖండంలో ఉంది. పేరు శాన్ మారినో. ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం. జనాభా దాదాపు 34 వేలు. ఏడాదిలో రెండుసార్లు ఎన్నికలు జరగడం.. ఫలితాలు వెలువడిన తరువాత అధ్యక్షుడు మారడం ఇక్కడ సర్వసాధారణం. ఎన్నికైన దేశాధినేతను ఆ దేశ ప్రజలు కెప్టెన్-రీజెంట్ అని పిలుస్తారు. గ్రేట్, జనరల్ కౌన్సిల్‌లోని 60 మంది సభ్యులు కెప్టెన్ రీజెంట్‌ను ఎన్నుకుంటారు. ఇక్కడి పార్లమెంటును ఆరంగో అంటారు.

World's most liveable city: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరం ఏదంటే..

శాన్‌ మారినోలో మొట్టమొదటి ఎన్నికలు క్రీస్తు శకం 1243లో జరిగాయి. ఈ దేశ రాజ్యాంగం 1600 నుంచి అమల్లోకి వచ్చింది. దేశం మొత్తం విస్తీర్ణం కేవలం 61  చదరపు కిలోమీటర్లు మాత్రమే.  ఇది ఇటలీ పొరుగు దేశం. ఇటలీ సంస్కృతి, భాష ఇక్కడ కనిపిస్తుంది.

Richest Persons 2023: ప్రపంచంలో అత్యంత ధనవంతులు 2023 విరే..

Published date : 24 Oct 2023 03:48PM

Photo Stories