Nominations: నామినేషన్ల సమయంలో A-ఫారం, B-ఫారం మధ్య వ్యత్యాసం ఇదే..
Sakshi Education
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో బీఫామ్ సమర్పించాలి.
సదరు పత్రంలో అభ్యర్థి పేరు. పార్టీ గుర్తు, నియోజకవర్గ వివరాలతో ఆ పార్టీ అధ్యక్షుడి సంతకం ఉంటుంది. నామినేషన్‌తో పాటు అభ్యర్థి బీఫామ్‌ను జతచేస్తేనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుర్తు కేటాయిస్తారు. అలాగే ‘ఏ’ ఫామ్‌ను సంబంధిత పార్టీ వారు ఎన్నికల కమిషన్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఇందులో పార్టీ పేరు, పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరి పేర్లు, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే పూర్తి వివరాలు ఏ ఫామ్‌లో ఉంటాయి.
సంతకాలను పోర్జరీ చేయకుండా ఏ ఫామ్‌లో మూడు చోట్ల పార్టీ అధ్యక్షుడి సంతకం ఉంటుంది. పోటీ చేయు అభ్యర్థి బీఫామ్‌ను నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారికి సమర్పించాక, ఏ ఫామ్‌ను ఎన్నికల కమిషన్‌కు అందజేస్తారు. ఈ రెండింటిని పోల్చిచూసి నిశతంగా పరిశీలించి అభ్యర్థికి సదరు పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.
Supreme Court Order: గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంరక్షణ కోసం సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు
Published date : 28 Mar 2024 02:28PM