Laureus Award: నొవాక్ జొకోవిచ్‌కు లారియస్ అవార్డు
Sakshi Education
పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ వార్షిక అవార్డుల్లో మెరిశాడు.
2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఈ సెర్బియా దిగ్గజం ‘ఉత్తమ క్రీడాకారుడు’ పురస్కారం గెల్చుకున్నాడు.
జొకోవిచ్‌కు ఈ అవార్డు లభించడం ఇది ఐదోసారి. 2023లో జొకోవిచ్ ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడంతోపాటు వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించాడు. మహిళల విభాగంలో స్పెయిన్ ఫుట్‌బాల్ ప్లేయర్ బొన్మాటి ‘ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు అందుకుంది.
Published date : 24 Apr 2024 01:17PM