Skip to main content

China's Forbidden City: ప్రపంచంలోనే అతిపెద్ద రాచప్రాసాదం

ఇక్క‌డ‌ కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్‌బిడెన్‌ సిటీ’గా పేరు పొందింది.
China's Forbidden City, Chinese History and Culture Symbol, Iconic Imperial Palace Complex
China's Forbidden City

చైనాలోని మింగ్‌ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్‌వు చక్రవర్తి కొడుకు ఝుడి నాన్‌జింగ్‌ నుంచి బీజింగ్‌కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్‌లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.

China New Map Objections: చైనా నూతన మ్యాప్‌పై భారత్‌ బాటలో పలు దేశాలు

Published date : 14 Sep 2023 08:37AM

Photo Stories