NASA: అమెరికాకు జర్మనీ శాస్త్రవేత్త సహకారం.. ఎవరు?
చంద్రుడి ఉపరితలంపైకి మనుషులను తీసుకువెళ్లడంలో అమెరికాకు హిట్లర్‌కు అత్యంత సన్నిహితుడైన శాస్త్రవేత్త సహకరించారు. ఈ ప్రయోగం నేపధ్యంలో నాసా ఖ్యాతిని సదరు శాస్త్రవేత్త ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. ఈ నేపధ్యంలో ఆ శాస్త్రవేత్తకు అమెరికా.. స్థానిక పౌరసత్వం ఇవ్వడంతోపాటు, భారీగా నగదు బహమానం కూడా అందించింది.
ఆ శాస్త్రవేత్త పేరు వెర్నెర్ వాన్ బ్రాన్. ఇతను జర్మనీలోని ధనిక కుటుంబంలో జన్మించాడు. అంతరిక్షంపై అతనికున్న అభిరుచి ఈ రంగంలో అతను మరింత ఎదిగేలా చేసింది. వెర్నెర్ వాన్ బ్రాన్‌కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతనికి అంతరిక్షంపై అభిరుచి ఏర్పడింది. బ్రాన్ పుట్టినరోజున అతని తల్లి టెలిస్కోప్ కానుకగా ఇచ్చింది. అది మొదలు బ్రాన్‌కు ఆకాశంలో ఏముందో చూడాలనే కోరిక మొదలయ్యింది.
బ్రాన్ తన 17 ఏళ్ల వయస్సులో బెర్లిన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. తరువాత తన 18 ఏళ్ల వయసులో జర్మన్ రాకెట్ సొసైటీలో ప్రవేశం పొందాడు. ఈ నేపధ్యంలోనే ద్రవ-ఇంధన రాకెట్ నిర్మాణాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడు. అదే సమయంలో అతనికి హిట్లర్‌తో అతని సాన్నిహిత్యం ఏర్పడింది. హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన వ్యక్తులలో ఒకనిగా మారాడు.
NEOM-A Top City In Saudi: సౌదీలో నియోమ్ నిర్మాణం.. అసలేంటిది?
1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో జర్మనీ అన్ని రంగాలలో ఓటమిని ఎదుర్కొంది. ఈ తరుణంలో హిట్లర్ సన్నిహితులకు ఆశ్రయం కల్పించాలని అమెరికా భావించింది. ఈ నేపధ్యంలోనే అమెరికా ‘ఆపరేషన్ పేపర్‌క్లిప్’ అనే ఆపరేషన్ చేపట్టింది. అప్పుడే బ్రాన్‌తో పాటు ఇతర జర్మన్ శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో అమెరికా చేరుకున్నారు.
Flag of Israel: జెండాపై ఉన్న అసలు చరిత్ర.. నక్షత్రం వెనుక కథ..!
ఈ శాస్త్రవేత్తల బృందం 1946 ఏప్రిల్ 16న అమెరికాలో తొలి క్షిపణి పరీక్ష వీ-2ను చేపట్టింది. ఇది అమెరికా అంతరిక్ష యాత్రను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లింది. దీని తర్వాత 1955లో అమెరికా ‘నాసా’ను స్థాపించినప్పుడు, బ్రాన్‌ను అమెరికా అక్కడకు పంపింది. 1969, జూలై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాడు. ఈ ప్రయోగంలో వెర్నెర్ వాన్ బ్రాన్ సేవలు మరువలేనివి.