Skip to main content

Adani Group: అదానీ కొంప మునిగింది... రెండు రోజుల్లో మూడున్న‌ర్ర‌ లక్షల కోట్ల సంపద హాంఫట్‌

షేర్‌మార్కెట్‌ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎవరీ అంతుపట్టదు. కొంతమంది మదుపర్లు మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసి కోట్లకు పడగలెత్తితే.. మరికొంతమంది సర్వం కోల్పోయి రోడ్డు మీదకు వస్తారు.

తాజాగా ఇలాంటి ఓ సంఘటనే మదపర్లను హడలెత్తిస్తోంది. లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. ఆ కథేంటో తెలుసుకుందామా.!
కొంపముంచిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌...!
గత ఏడెనిమిదేళ్లుగా అదానీ గ్రూపు దూసుకెళ్తోంది. ఎక్కడో ఉన్న అదానీ.. ఈ కొద్ది సంవత్సరాలలోనే లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. దేశంలోనే రిచెస్ట్‌ పర్సన్‌గా అవతరించాడు. అయితే ఆయన కొంపను హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే సంస్థ ముంచేలా ఉంది. హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ అదానీ కంపెనీల మార్కెట్‌ వాల్యూ లోపభూయిష్టమంటూ వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పేకముక్కల్లా కూలుతున్నాయి.

చ‌దవండి: షార్ట్‌కట్స్‌ వద్దు... చీటింగ్‌ చేసేందుకు తెలివితేటల్ని వినియోగించకండి

Adani


మొత్తం తొమ్మిది లిస్టెడ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌ అవర్స్‌లో గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో దాదాపు రూ. 3.4 లక్షల కోట్లకుపైగా కోల్పోయింది. ఒక్కరోజే సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా  కుప్పకూలగా, నిఫ్టీ 333 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. ఈ పతనం ఏ మేరకు కొనసాగుతుందనే ఆందోళన నెలకొంది.

చ‌దవండి: 2024లో రోదసిలోకి మానవుడు.... చరిత్ర సృష్టించనున్న ఇస్రో
20 శాతం మేర పతనం...
అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్లు 20 శాతం మేర భారీ పతనాన్ని నమోదు చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 13.5 శాతం క్షీణించింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌ మిషన్‌ 12 శాతానికి పైగా పడిపోయాయి. అలాగే అంబుజా సిమెంట్, ఏసీసీ 6 శాతానికి పైగా పతనమవగా.. అదానీ పవర్, అదానీ విల్‌మార్‌ షేర్లు 5 శాతం చొప్పున క్షీణించాయి.
హిండెన్‌ బర్గ్‌ ప్రతి సవాల్‌...
మరోవైపు హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌పై దావా వేయనున్నట్లు అదానీ ప్రకటించింది. అవన్నీ తప్పుడు వార్తలు తప్పుడు సమాచారరమని కొట్టి పారేసింది. భారతీయ చట్టాల కింద సంబంధిత నిబంధనలను పరిశీలిస్తున్నామని అదానీ లీగల్‌ గ్రూప్‌ హెడ్‌ జతిన్‌ జలంధ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ స్పష్టం చేసింది. 

చ‌దవండి: సాయంత్రం 5 తర్వాతే బడ్జెట్‌ ప్రవేశపెట్టేవారు.. ఎందుకో తెలుసా...
24న నివేదిక బట్టబయలు....
తమ వద్ద సుదీర్ఘ పత్రాల జాబితా ఉందని హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ ట్విటర్‌లో తెలిపింది. అటు అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఆర్‌బీఐ, సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్‌  ఊపందుకుంది. స్టాక్‌ మార్కెట్‌ మానిప్యులేషన్, మనీలాండరింగ్‌  చేసిందంటూ గౌతమ్‌ అదానీ  నేతృత్వంలోని అదానీ గ్రూపుపై జనవరి 24న అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ సంచలన నివేదిక  ప్రకటించిన సంగతి తెలిసిందే.

చ‌దవండి: అదానీకి జాక్‌పాట్‌ ఇయర్‌... ఆయన ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా

Published date : 27 Jan 2023 05:45PM

Photo Stories