Skip to main content

Human Rights day: ఇవే మీ హక్కులు..

భూమ్మీద జీవించే ప్రతి మనిషికి పుట్టుకతోనే కొన్ని హక్కులు ఉంటాయి.
Human Rights day
మానవ హక్కుల దినోత్సవం

1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి తొలిసారిగా ‘విశ్వ మానవ హక్కుల ప్రకటన’ చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబరు 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు. భారతదేశంలో కూడా ఇదే రోజును హూమన్ రైట్స్ డేగా పరిగణిస్తారు. 1948లో ఐక్యరాజ్యసమితి ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (యూడీహెచ్‌ఆర్‌)’ పేరుతో డిక్లరేషన్ ను విడుదల చేసింది. ఇది ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించే ఒక అధికార పత్రం. దీన్ని ప్రపంచంలోనే అత్యధిక భాషల్లోకి అనువదించారు. దాదాపు 500 భాషల్లోకి ఇది ట్రాన్స్‌లేట్ అయ్యింది. ప్రపంచంలో ఉన్న మానవులు అంతా ఒక్కటే ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన గౌరవం, సమానమైన, శాశ్వతమైన హక్కులు ఉన్నాయి.

ప్రారంభం

ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్‌ డిక్లరేషన్ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ (యూడీహెచ్‌ఆర్‌)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్ లు ఏర్పాటుచేయబడ్డాయి.

 

UDHR ప్రకారం కొన్ని మానవ హక్కులు

  • మనుషులు అందరూ సమానమే.
  • ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే స్వేచ్ఛా, సమానత్వం ఉంటాయి.
  • ప్రతి మనిషికి ఆ దేశ రాజ్యాంగానికి లోబడి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది.
  • జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ ఏవిధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు.
  • చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు
  • వెట్టిచాకిరీ, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు
  • కారణం లేకుండా ఏ మానవున్ని నిర్బంధించబడకుండా ఉండేహక్కు.
  • స్వేచ్ఛగా స్వదేశంలో లేదా విదేశాల్లో పర్యటించే హక్కు
  • విద్యాహక్కు.
  • ఏ మతాన్నయినా స్వీకరించి జీవించే హక్కు.
  • ఆస్తి హక్కు.
  • వాక్ స్వాతంత్రం.
  • దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛ.

చదవండి:

Published date : 10 Dec 2021 05:26PM

Photo Stories