Industrialization Strategy: దిగుమతులను తగ్గించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు... స్వాతంత్య్రానంతరం పారిశ్రామిక విధానం ఇలా...
తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. స్వాతంత్య్రం శిద్ధించినప్పటినుంచి ఇప్పటివరకు దేశీయ తయారీ రంగంలోని కీలక దశలు, పరిణామాలు ఇలా ఉన్నాయి.
పారిశ్రామిక విధాన తీర్మానం:
ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న పాలకులు సమ సమాజాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా 1948 లో మొదటి పారిశ్రామిక విధానాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వమే పరిశ్రమలను స్థాపించింది.
చదవండి: వచ్చే నెల నుంచే వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తరగతులు
దిగుమతులకు ప్రత్యామ్నాయంగా...:
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు వినియోగ వస్తువులు, మూలధన వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడం ప్రారంభమైంది. దిగుమతులను తగ్గించాలంటే దేశీయంగానే ఉత్పత్తి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 1950 దశకం ప్రారంభం నుంచి 1980 వరకు దిగుమతులకు ప్రత్యామ్నాయంగా పారిశ్రామికీకరణ వ్యూహాన్ని అనుసరించింది. ఇది ఉక్కు, భారీ యంత్రాలు, వస్త్రాలు, రసాయనాలతో సహా అనేక రకాల తయారీ పరిశ్రమల స్థాపనకు దారితీసింది.
ప్రభుత్వ రంగ ఆధిపత్యం:
స్వాతంత్య్రానంతరం తొలి దశాబ్దాల్లో తయారీ రంగంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఉక్కు (సెయిల్), భారీ యంత్రాలు (బీహెచ్ఈఎల్), పెట్రోలియం (ఓఎన్‌జీసీ) వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రారంభించారు.
లైసెన్స్ రాజ్:
స్వాతంత్య్రం తొలినాళ్లలోనే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తే జాతి ఫలాలు దేశమంతటికీ అందుతాయో లేదో అన్న భయాందోళన నాటి పాలకుల్లో స్పష్టంగా ఉండేది. దీంతో అన్ని రంగాల్లోనూ ప్రభుత్వమే కీలకపాత్ర పోషించేది. ఏదైనా ప్రైవేటు సంస్థలు పరిశ్రమలను స్థాపించాలంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చేది. పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చే లైసెన్స్‌ల విషయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. 1990లో ఆర్థిక రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు వెలువడే వరకు నిబంధనలు కఠినంగానే ఉండేవి.
చదవండి: ఒకరి తర్వాత మరొకరు.. ఐటీ కంపెనీలను వీడుతున్న సీనియర్లు..
ఆర్థిక సరళీకరణ:
1991లో భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను సరళీకరించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వాణిజ్యాభివృద్ధి సాధించడానికి ఆర్థిక సంస్కరణలకు తెరలేపింది. ఫలితంగా లైసెన్స్ రాజ్ రద్దు, దిగుమతి సుంకాల తగ్గింపుతో పాటు అనేక పరిశ్రమల క్రమబద్ధీకరణకు దారితీసింది. ఈ నిర్ణయం ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడుల పెరుగుదలకు దారితీసింది.
ప్రయివేటు రంగం వృద్ధి:
ఆర్థిక సరళీకరణ తరువాత తయారీ రంగంలో ప్రైవేట్ రంగం చొచ్చుకెళ్లింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, కన్జ్యూమర్ గూడ్స్ సహా వివిధ రంగాల్లో ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.
స్పెషల్ ఎకనామిక్ జోన్లు (సెజ్):
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం స్పెషల్ ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేసింది. తయారీతో పాటు ఎగుమతి-ఆధారిత కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వీటిని ఏర్పాటు చేశారు. ఈ సెజ్‌లలో పరిశ్రమలు స్థాపిస్తే వివిధ పన్ను ప్రోత్సాహకాలు, కస్టమ్స్ సుంకాలలో రాయితీ వంటి ప్రయోజనాలను ప్రభుత్వం అందించింది.
చదవండి: ఇకపై రోగులు విసిగించినా, దురుసుగా ప్రవర్తించినా వైద్యం బంద్...
టెక్నాలజీ, ఇన్నోవేషన్ పై దృష్టి:
నాలెడ్జ్ ఎకానమీ పెరగడంతో టెక్నాలజీ, ఇన్నోవేషన్ కు భారత్ పెద్దపీట వేసింది. ముఖ్యంగా ఐటి రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. సాఫ్ట్ వేర్ అభివృద్ధితో పాటు ఐటి సేవలకు భారతదేశం ప్రపంచ కేంద్రంగా మారింది.
తయారీ విధానం:
దేశ జీడీపీలో తయారీ రంగం వాటాను పెంచడం, ఈ రంగంలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో 2011లో భారత ప్రభుత్వం జాతీయ తయారీ విధానాన్ని (ఎన్ఎంపీ) ఆవిష్కరించింది. ఉత్పాదక రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడం, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ.. దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమాన్ని చేపట్టింది.
మేకిన్ ఇండియా:
2014 సెప్టెంబర్ లో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం. పెట్టుబడి విధానాన్ని సరళతరం చేయడంతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా వివిధ రంగాల్లో దేశీయ తయారీని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
చదవండి: అంచెలంచెలుగా ఎదుగుతూ.. అగ్రగామిగా నిలుస్తూ... ఏడున్నర్ర దశాబ్దాలలో దేశం సాధించిన ప్రగతి ఇలా
జాతీయ తయారీ విధానం(ఎన్ఎంపీ):
దేశ జీడీపీలో తయారీ రంగం వాటాను పెంచడంతో పాటు 2022 నాటికి 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా 2011లో జాతీయ తయారీ విధానాన్ని ప్రారంభించారు. మోదీ పాలనకు ముందే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, ఆయన ప్రభుత్వం దీని అమలుపై దృష్టి సారించింది.
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ):
పరోక్ష పన్నులను క్రమబద్ధీకరించే దిశగా జూలై 2017 లో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్‌ను భారత ప్రభుత్వం అమలు చేసింది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్నును ప్రవేశపెట్టడం ద్వారా పన్ను విధానాన్ని సరళతరం చేయడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం.. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
స్కిల్ ఇండియా:
నైపుణ్యాల లేమితో అభివ`ద్ధి అంతంతమాత్రంగానే జరుగుతోందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. కార్మికుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు, మెరుగైన ఉపాధి కల్పించడానికి స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. తయారీ రంగంలో పరిశ్రమ అవసరాలమేరకు కార్మికుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే కార్యక్రమ ముఖ్యోద్దేశం.
ఇండస్ట్రియల్ కారిడార్లు:
తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించడానికి అలాగే సులభంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (డీఎంఐసీ), చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ) వంటి డెడికేటెడ్ ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధిని ప్రారంభించింది.
చదవండి: ఈ ఉద్యోగం కోసం 10 లక్షల మంది దరఖాస్తులు.. జీతం మాత్రం రూ.25,500
ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై):
తయారీ రంగంతో సహా వ్యాపార కార్యకలాపాలకు రుణాలు అందించడం ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా ఆర్థిక మద్దతును అందించడం లక్ష్యంగా 2015 ఏప్రిల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
స్టార్టప్ ఇండియా:
కొత్తకొత్త ఐడియాలతో యువత స్టార్టప్‌లను ప్రారంభించడం మొదలుపెట్టారు. వినూత్న ఆలోచనలే పెట్టుబడిగా ముందుకు కదిలారు. వీరిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2016 జనవరిలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టార్టప్‌ల ఏర్పాటు చేయడం కోసం వివిధ ప్రోత్సాహకాలను అందించింది. అయితే ఏ ప్రభుత్వంలోనైనా తీసుకున్న విధానపర నిర్ణయాలను మార్పు చేసుకోవడండం లేదా వాటిని మరింత ఆధునికీకరించడం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధ్యం.