రూపాయి విలువ క్షీణత-భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
Sakshi Education
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు అంతకంతకూ దిగజారుతోంది. ఈ పరిణామం విదేశాల్లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలకు అనుకూలంగా మారింది. ఎందుకంటే వారు సంపాదించిన డబ్బును డాలర్ల రూపంలో భారత్‌కు పంపుతారు. అదేవిధంగా మన దేశం ప్రధానంగా దిగుమతులపై ఆధారపడిన దేశం కావడం వల్ల చెల్లింపులకు ఎక్కువ వ్యయం అవుతుంది. ఈ నేపథ్యంలో రూపాయి విలువ క్షీణత ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉందో తెలుసుకుందాం.
ఇటీవల అమెరికా డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి వినిమయ రేటులో తగ్గుదల భారత్‌లో మాత్రమే ప్రత్యేకంగా సంభవించలేదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలైన బ్రెజిల్ (బ్రెజీలియన్ రియల్), అర్జెంటీనా (పీసో), రష్యా(రూబుల్), దక్షిణాఫ్రికా(ర్యాండ్) దేశాల కరెన్సీ విలువలు కూడా డాలర్‌తో పోలిస్తే క్షీణిస్తున్నాయి. ఆగస్టు 2011 నుంచి డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువలో ఒడుదొడుకులు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుత అనిశ్చిత ప్రపంచ ఆర్థిక వాతావరణం నేపథ్యంలో, యూరోజోన్ దేశాల రుణ (Sovereign debt) సంక్షోభం కారణంగా సురక్షిత ఆస్తిగా డాలర్‌కు డిమాండ్ పెరగడం ఈ స్థితికి కారణమైంది. దిగుమతుల విలువతో పోల్చినపుడు ఎగుమతుల విలువలో క్షీణత వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరిగింది. అధిక చమురు ధరలు, బంగారం దిగుమతులు పెరిగిన కారణంగా దిగుమతుల బిల్లు పెరుగుతుంది. అధిక కరెంట్ అకౌంట్ లోటు, స్వదేశీ, విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో నిరుత్సాహపూరిత వాతావరణం ఏర్పడడానికి కారణమైంది. ఈ స్థితి కరెన్సీపై డౌన్‌వర్డ్ ప్రెజర్‌ను పెంచింది.
మూలధన ప్రవాహ ఒడిదుడుకుల కారణంగా కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. డాలర్‌తో పోల్చినపుడు రూపాయి మారకపు విలువ మే 2న 53.7 రూపాయలు కాగా, జూన్ 1న రూ. 56.6లు, జూన్ 11న రూ. 58.9కు తగ్గింది. ఈ మధ్య కాలం (మే 2 నుంచి జూన్ 11వరకు)లో రూపాయి 10 శాతం విలువను కోల్పోయింది. రూపాయి విలువ క్షీణత పరిణామాల నేపథ్యంలో.. టోకు ధరల సూచీ నియంత్రణలో ఉన్నప్పటికీ రెపోరేటు తగ్గించాలనే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసింది. పారిశ్రామిక రంగంపై రూపాయి విలువ క్షీణత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చమురు, బొగ్గు దిగుమతులు, మెటల్స్, ఖనిజాలు, పారిశ్రామిక మాధ్యమిక ఉత్పత్తుల వ్యయాలు పెరుగుతాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌డీఐ) ఈ నెలలో 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ చర్య భారత బాండ్ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు అంతరాయం ఏర్పడడానికి కారణమైంది.
క్షీణత నివారణ ఆవశ్యకత:
దీర్ఘకాలంగా కొనసాగుతున్న రూపాయి విలువలో క్షీణత ఆందోళన కలిగించే పరిణామం. రూపాయి విలువ క్షీణత దిగుమతుల వ్యయం పెరుగుదలకు దారితీస్తుంది. పెరుగుతున్న చమురు డిమాండ్‌కు అనుగుణంగా దిగుమతులు పెరగడం వల్ల దిగుమతుల బిల్లు పెరుగుతుంది. చమురుతోపాటు ఇతర మెటల్స్, బంగారం దిగుమతుల వ్యయం పెరగడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, బంగారం ధరలు తగ్గినప్పటికీ రూపాయి విలువ క్షీణత కారణంగా వినియోగదారుడికి ఏవిధమైన ప్రయోజనం ఉండదు. భారత్ నిర్మాణాత్మకంగా ‘దిగుమతి సాంద్రత’ దేశమైనందువల్ల రూపాయి విలువ క్షీణత స్వదేశీ ద్రవ్యోల్బణ రేటుపై ఒత్తిడి పెంచుతుంది. పెరుగుతున్న కరెంట్ అకౌంట్ లోటు ఆధారంగా ఈ పరిణామాలను గమనించవచ్చు. వినిమయ రేటులో ఏర్పడుతున్న ఒడిదుడుకుల కారణంగా విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది.
రఘురామ్ రాజన్ అభిప్రాయం:
అమెరికాలో ఇటీవల సంభవించిన పరిణామాలు మూలధన ప్రవాహాలపై ప్రభావం చూపించాయని ఆర్థిక మంత్రిత్వశాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో దీర్ఘకాల వడ్డీరేట్ల పెరుగుదల వల్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల రుణ ప్రవాహాలపై ప్రభావం కనిపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ స్థితి భారత్‌తోపాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలపై ప్రభావం చూపించింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, సెబీ జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయని, అవసరమైన సమయంలో తగిన చర్యలు తీసుకోవడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. నిరాశావాద దృక్పథం అవసరం లేదని, కరెంట్ అకౌంట్‌లోటు పెరుగుతున్నప్పటికీ నియంత్రించగలమని రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్‌లో బంగారం దిగుమతులు తగ్గడం ఆర్థిక వ్యవస్థకు కొంతమేర ప్రయోజనకరమని, రూపాయి వినిమయ రేటులో క్షీణత తగ్గి త్వరలోనే పురోగమించగలదని, తద్వారా పెట్టుబడిదారులు భారత ఆర్థిక వ్యవస్థను అభినందించగలరని రాజన్ అభిప్రాయపడ్డారు.
రూపాయి విలువ క్షీణతకు దారితీసిన పరిణామాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడే అనిశ్చిత పరిస్థితుల వల్ల నష్టభయం (Risk)తో కూడుకున్న పెట్టుబడులపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుంది. భారత్‌లో పోర్ట్ ఫోలియో పెట్టుబడులపై ప్రపంచవ్యాప్తంగా సంభవించిన పరిణామాలు రుణాత్మక ప్రభావం చూపించాయి. బయటకు తరలివెళ్లే మూలధన ప్రవాహాలు లేదా తగ్గుతున్న పెట్టుబడులు వినిమయ రేటుపై డౌన్‌వర్డ్ ప్రెజర్‌ను కలుగజేస్తాయి. ప్రపంచవ్యాప్త అనిశ్చిత పరిస్థితులు కరెంట్ అకౌంట్, మూలధన అకౌంట్‌పై తీవ్ర ప్రభావం చూపడంతో రూపాయి విలువ క్షీణించింది.
కరెంట్ అకౌంట్ లోటులో పెరుగుదల ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి తగ్గుదలకు, నిరుద్యోగం పెరుగుదలకు కారణమవుతుంది. విదేశీ రుణాలు పెరగడం వల్ల వినిమయ రేటులో తగ్గుదల ఏర్పడుతుంది. ప్రత్యక్ష పన్నులకోడ్, వస్తు, సేవలపై పన్నుకు సంబంధించిన విధాన సంస్కరణలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. సబ్సిడీలపరంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తూ ద్రవ్యలోటును నియంత్రించుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారులలో విశ్వాసం పెంపొందించే విధంగా సంస్కరణలు వేగవంతం చేయవలసిన అవసరం ఉంది.

- గత రెండేళ్లుగా భారత్ అధిక ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటున్నది. ద్రవ్యోల్బణం కారణంగా భారత్‌లో ఆర్థిక వృద్ధి మందగించిన క్రమంలో మూలధనం బయట దేశాలకు తరలివెళ్లడం రూపాయి విలువ క్షీణతకు కారణమవుతుంది.
- అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడం కొంతమేర రూపాయి విలువ క్షీణత నివారణకు ఉపకరించినప్పటికీ భారత్‌తో ముఖ్య వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాల్లో సంక్షోభం కారణంగా రూపాయి వినిమయ రేటులో పెరుగుదల ఏర్పడలేదు.
- అధిక వడ్డీరేటు విదేశీ పెట్టుబడుల పెరుగుదలకు దోహదపడుతుంది. ఇటీవల కాలంలో భారత్‌లో వృద్ధి మందగించిన క్రమంలో రిజర్వ్ బ్యాంక్ విధానరేట్లను తగ్గించే విధంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులకు ముందుకు రానందువల్ల భారత్‌లోకి మూలధన ప్రవాహాలు తగ్గి రూపాయి విలువ క్షీణతకు గురైంది.
- గత మూడేళ్లలో భారత్ విదేశీ మారక ద్రవ్యనిల్వలు సగటున 300 బిలియన్ డాలర్లను మించలేదు. డాలర్ రూపంలో నికర రాబడులు ఆర్జించడంలో భారత్ అసమర్థతను ఈ స్థితి తెలియజేస్తుంది. విదేశీ వాణిజ్యానికి సరిపోయే విదేశీమారక నిల్వలు లేనప్పుడు డాలర్‌కు డిమాండ్ పెరుగుతున్న కారణంగా రూపాయి విలువ క్షీణిస్తుంది.
- రూపాయి విలువలో క్షీణత వల్ల దిగుమతి వ్యయం పెరుగుతుంది. ఆ మేరకు ఎగుమతి వస్తువుల ధరల్లో పెరుగుదల లేనప్పుడు కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. తద్వారా సమష్టి డిమాండ్, సమష్టి సప్లయ్‌లో తగ్గుదలకు దారితీస్తుంది.
- దిగుమతి చేసుకునే పారిశ్రామిక ముడిసరుకుల ధరలు పెరిగినందువల్ల అంతిమ వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ స్థితి లక్షిత వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు కుంటుపడడానికి కారణమవుతుంది.
- ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయంలో 2010లో 894 టన్నులు, 2011లో 969 టన్నుల బంగారాన్ని భారత్ కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ రూపేణా ధరలు తక్కువగా ఉన్నప్పటికీ భారత్‌లో రూపాయి విలువ క్షీణత కారణంగా బంగారం ధరలు పెరిగాయి.
- విదేశీ కరెన్సీ రుణాలు తీసుకున్న కంపెనీలు, ముడిసరుకుల దిగుమతులపై రూపాయి విలువలో క్షీణత ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఈక్విటీ పెట్టుబడిదారులు చమురు, గ్యాస్, ఫార్మా, ఆటోమొబైల్, విమానరంగాలపై పెట్టుబడులు తగ్గిస్తారు.
- క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే కంపెనీలు స్వదేశీ మార్కెట్‌లో ధరలు పెంచడానికి ధరల నియంత్రణ అడ్డంకిగా ఉండటం ఒక సమస్యగా పరిణమిస్తుంది.
- ఫార్మా కంపెనీల ‘రికవరీ కాని రుణాలు’ ఎక్కువగా ఉండటం వల్ల ఆయా కంపెనీలకు రుణాల చెల్లింపు భారంగా మారుతుంది.
- ఆటోమొబైల్ రంగంలో అవసరమైన ముడిసరుకుల్లో 10 నుంచి 15 శాతం వరకు దిగుమతులపై ఆధారపడి ఉంది. స్వదేశీ ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయం డాలర్ రూపంలో ఉన్నందువల్ల ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న స్వదేశీ ఎయిర్‌లైన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి.
- బొగ్గు దిగుమతులపై ఆధారపడిన విద్యుచ్ఛక్తి ప్లాంట్లపై రూపాయి విలువ క్షీణత రుణాత్మక ప్రభావం చూపిస్తుంది. విద్యుచ్ఛక్తి ప్లాంట్ల ఉత్పాదన సామర్థ్యం తగ్గి శక్తి సంక్షోభం ఏర్పడుతుంది. ఈ స్థితి వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో వృద్ధి మందగించడానికి కారణమవుతుం ది. దిగుమతుల వ్యయం పెరగడంతోపాటు ఏవిధమైన మార్పులు లేని (Inflexible) టారిఫ్ వల్ల పవర్ కంపెనీలు ఇప్పటికే అనేక నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
- ఎరువుల దిగుమతి ధరలు పెరగడం వల్ల ప్రభుత్వానికి సబ్సిడీ భారం కూడా పెరుగుతుంది. డిమాండ్ తగ్గుతుందనే భయం ఒకవైపు, పెరుగుతున్న పోటీ మరోవైపు ధరలు పెంచడానికి ఆటంకమవుతున్నందువల్ల ఎరువుల కంపెనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి.
- పామాయిల్ దిగుమతి వ్యయం పెరిగిన కారణంగా FMCG పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు పెరిగి ఆయా సంస్థల లాభదాయకత తగ్గుతుంది. తద్వారా పెట్టబడులు, ఉపాధి క్షీణిస్తాయి.
- కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లపై పెట్టుబడి పరిమితిని 5 బిలియన్ డాలర్లకు పెంచారు. ఈ చర్య విదేశీ పెట్టుబడి పరిమితిని రుణ మార్కెట్‌లో 60 బిలియన్ డాలర్లకు పెంచుతుంది.
- కరెన్సీ మార్కెట్‌లో ఒడుదొడుకుల నివారణకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌ను విరమించుకున్న కంపెనీలు తిరిగి రీబుకింగ్‌ను నివారించాయి.
- నాన్ రెసిడెంట్ బహిర్గత డిపాజిట్లపై వడ్డీరేటు నిర్ణయించుకొనే స్వేచ్ఛ బ్యాంకులకు ఇచ్చారు. ఈ డిపాజిట్లపై ఏ విధమైన పన్ను ఉండదు.
- ఏడాది నుంచి మూడేళ్ల లోపు కాల పరిమితి గల విదేశీ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లపై వడ్డీరేటు పరిమితి పెంపు.
- స్థానికుల రుణాల మంజూరు విషయంలో విదేశీ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లను తనఖా (Collateral) నిమిత్తం వినియోగించుకునే విషయంలో నిబంధనలు తగ్గించారు.
- విదేశీ కరెన్సీలో ఎగుమతుల పరపతికి సంబంధించిన పరిమితి రేటుపై నియంత్రణలు తొలగించారు.
- ఎగుమతిదారులు తమ వద్దనున్న విదేశీ కరెన్సీని వెంటనే విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో విక్రయించాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది. వ్యక్తులు కలిగి ఉండే EEFC అకౌంట్లకు (Exchange Earner's Foreign Currency Accounts) కూడా ఇది వర్తిస్తుంది.
- కార్పొరేట్ రుణమార్కెట్‌కు నిధులు పెంచడం, విదేశీ మూలధన ప్రవాహాలను పెంచే ఉద్దేశంతో అర్హతగల పెట్టుబడిదారులు కార్పొరేట్ రుణ బాండ్లపై బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి అనుమతించారు.
- బంగారం దిగుమతిని నియంత్రించే క్రమంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 నుంచి 8 శాతానికి పెంచారు.
కరెంట్ అకౌంట్ లోటులో పెరుగుదల ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి తగ్గుదలకు, నిరుద్యోగం పెరుగుదలకు కారణమవుతుంది. విదేశీ రుణాలు పెరగడం వల్ల వినిమయ రేటులో తగ్గుదల ఏర్పడుతుంది. ప్రత్యక్ష పన్నులకోడ్, వస్తు, సేవలపై పన్నుకు సంబంధించిన విధాన సంస్కరణలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. సబ్సిడీలపరంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తూ ద్రవ్యలోటును నియంత్రించుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారులలో విశ్వాసం పెంపొందించే విధంగా సంస్కరణలు వేగవంతం చేయవలసిన అవసరం ఉంది.
Published date : 01 Aug 2013 04:01PM