మానవాభివృద్ధి నివేదిక-2016
Sakshi Education
డా॥తమ్మా కోటిరెడ్డి, పొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
గడచిన దశాబ్ద కాలంలో ప్రపంచంలోని ప్రతి దేశం మానవాభివృద్ధిలో గణనీయమైన ప్రగతి నమోదు చేసిందని మానవాభివృద్ధి నివేదిక -2016 పేర్కొంది. కానీ, జరిగిన ప్రగతి వల్ల కొన్ని మిలియన్ల మంది ప్రజలకు ఎలాంటి ప్రయోజనం, లబ్ధి చేకూరలేదు. దీనికి కారణాలేంటి ? అనే దానిపై మానవాభివృద్ధి నివేదిక- 2016 దృష్టి సారించింది.
ఏ సమాజంలోనైనా ఇతరులతో పోల్చితే ప్రయోజనాలు పొందడంలో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే ఎందుకు నిర్లక్ష్యానికి గురయ్యారు? ఆయా వర్గాల అభివృద్ధికి ఉన్న అడ్డంకులేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను తాజా మానవాభివృద్ధి నివేదిక గుర్తించింది. ఇందులో భాగంగా ప్రతివ్యక్తిలో మానవాభివృద్ధిని మెరుగుపర్చేందుకు సమాజం తీసుకోవాల్సిన చర్యలను నివేదిక పరిశీలించింది. ఈ దిశగా నివేదిక జాతీయ స్థాయిలో విధాన నిర్ణయాలు అందించడం, ప్రపంచ వ్యాప్తంగా సమర్థవంతమైన అభివృద్ధి సాధించడం, అభివృద్ధి పరంగా ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయకపోవడం, 2030 అజెండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిసారించింది. 1990-2015 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సగటు మానవాభివృద్ధిలో పెరుగుదల ఉన్నప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు అల్ప మానావాభివృద్ధి కలిగి ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయా దేశాల్లో పేదరికం, నిర్లక్ష్యానికి గురికావడం వంటివి సవాలుగా పరిణమించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో (పిల్లల్లో 1/3 వంతుకు పైగా కలిపి) 300 మిలియన్ల మంది ప్రజలు సాపేక్ష పేదరికాన్ని అనుభవిస్తున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. మొత్తం 100 దేశాల్లోని మహిళలు కొన్ని ఉద్యోగాల నుంచి చట్టబద్ధంగా మినహాయింపునకు గురయ్యారు. దీంతోపాటు ప్రపంచంలోని 250 మిలియన్లకుపైగా ప్రజలు జాతి పరంగా వివక్షకు గురయినట్లు నివేదిక పేర్కొంది. భారతదేశంలో 21.2 శాతం మంది ప్రజలు.. ఆదాయ పేదరిక రేఖకు దిగువున నివసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
డెమోగ్రఫీ
మొత్తం జనాభా 1311.1 మిలియన్లు కాగా, మధ్యస్థ వయసు 26.6 సంవత్సరాలు. 15 నుంచి 64 సంవత్సరాల వయోవర్గం వారిపై 65 సంవత్సరాలు, అంతకు పైబడిన వయోవర్గం వారి డిపెండెన్సీ రేషియో 8.6. 15 నుంచి 65 సంవత్సరాల జనాభాను 860 మిలియన్లుగా, 65 సంవత్సరాలు.. అంతకు పైబడిన వయోవర్గం జనాభాను 73.6 మిలియన్లుగా, ఐదు సంవత్సరాల లోపు వయోవర్గ జనాభాను 123.7 మిలియన్లుగా నివేదిక పేర్కొంది. భారతదేశ జనాభాలో పట్టణ జనాభా 32.7 శాతంగా నివేదిక అంచనా వేసింది.
2016 - వివిధ సూచికలు
భారతదేశం-నివేదిక
ఆరోగ్యం
మహిళల్లో ప్రతి వెయ్యి జనాభాకు సంబంధించి వయోజన మరణరేటు 145 కాగా, పురుషుల్లో 217.
విద్య
15 సంవత్సరాలు అంతకు పైబడిన వారిలో వయోజన అక్షరాస్యత రేటు 72.1 శాతం. విద్యపై ప్రభుత్వరంగ వ్యయం.. జీడీపీలో 3.8 శాతం. 25 సంవత్సరాలకు పైబడిన వారిలో కనీసం సెకండరీ విద్యను అభ్యసించినవారు 48.7 శాతం కాగా, ప్రాథమిక పాఠశాల్లో విద్యార్థి-టీచరు నిష్పత్తి 1:32గా (ప్రతి టీచరుకు 32 మంది విద్యార్థులు) ఉంది.
ఆదాయం
సర్దుబాటు చేసిన నికర పొదుపు స్థూల జాతీయాదాయంలో 19 శాతం కాగా, విత్త రంగం వాటా దేశీయ పరపతిలో(జీడీపీలో) 76.8 శాతం.
పని, ఉపాధి
15 సంవత్సారాలు, అంతకు పైబడిన వారిలో ఉపాధి పొందుతున్నవారు 51.9 శాతంగా ఉన్నారు. 5 నుంచి 14 సంవత్సరాల వయోవర్గంలో బాలకార్మికులు 12 శాతం. మొత్తం ఉపాధిలో వ్యవసాయ రంగ వాటా 49.7 శాతం కాగా, సేవారంగ వాటా 28.7 శాతం.
వాణిజ్యం, విత్త ప్రవాహాలు
స్థూల దేశీయోత్పత్తిలో ఎగుమతులు, దిగుమతులు 48.8 శాతం. ఎగుమతులకు సంబంధించి concentration Index 0.175గా ఉంది. స్థూల జాతీయాదాయంలో విదేశీ రుణం 22.7 శాతం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నికర ప్రవాహాలు జీడీపీలో 2.1 శాతంగా ఉన్నాయి.
సమాచారం
దేశ జనాభాలో 26 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ప్రతి 100 మందిలో 78.8 శాతం మంది మొబైల్ పోన్లు కలిగి ఉన్నారు. నికర వలసరేటు ప్రతి వెయ్యి జనాభాకు - 0.4గా ఉంది.
పర్యావరణ సుస్థిరత
తలసరి కార్బన్ డైఆక్సైడ్ విడుదల 1.6 టన్నులు కాగా, మొత్తం భూ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 23.8 శాతం. 1990-2015 మధ్యకాలంలో అటవీ విస్తీర్ణంలో మార్పు 10.5 శాతం. మొత్తం అంతిమశక్తి వినియోగంలో పునరుత్పాదక శక్తి వినియోగం 39 శాతం. స్థూల జాతీయాదాయంలో సహజ వనరుల క్షీణత 2.9 శాతం.

- మానవాభివృద్ధి నివేదిక-2016 ప్రకారం మానవాభివృద్ధి సూచీలో నార్వే ప్రథమ స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లు 0.939 స్కోరుతో రెండో స్థానంలో నిలిచాయి. యూఎన్‌డీపీ మొత్తం 188 దేశాలతో మానవాభివృద్ధి సూచీని రూపొందించింది. ఈ సూచీలో చైనా 90, పాకిస్తాన్ 147, బంగ్లాదేశ్ 139, భారతదేశం 131వ స్థానం (0.624)లో నిలిచాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఈ సూచీలో చిట్ట చివరి (188) స్థానం పొందింది.
- నార్వే (2015 సంవత్సరం ఆధారంగా) మానవాభివృద్ధి సూచీ విలువ 0.949 కాగా, అమెరికా 0.920, చైనా 0.738, భారత్ 0.624 విలువలు పొందాయి.
- మానవాభివృద్ధి నివేదిక.. దేశాలను అత్యంత మానవాభివృద్ధి చెందిన దేశాలు, అధిక మానవాభివృద్ధి చెందిన దేశాలు, మధ్యస్థ మానవాభివృద్ధి చెందిన దేశాలు, అల్ప మానవాభివృద్ధి దేశాలుగా వర్గీకరించింది. 51 దేశాలను అత్యంత మానవాభివృద్ధి చెందిన దేశాలుగా, 55 దేశాలను అధిక మానవాభివృద్ధి చెందిన దేశాలుగా, 41 దేశాలను మధ్యస్థ మానవాభివృద్ధి దేశాలుగా, 41 దేశాలను అల్ప మానవాభివృద్ధి దేశాలుగా నిలిచాయి.
- భారతదేశానికి సంబంధించి మానవాభివృద్ధి సూచీ రూపకల్పనలో వినియోగించే వివిధ సూచికల ప్రగతిని పరిశీలిస్తే.. 2015లో ఆయుఃప్రమాణం 68.3 సంవత్సరాలుగా, ఎక్స్‌పెక్టెడ్ ఇయర్‌స ఆఫ్ స్కూలింగ్ 11.7 సంవత్సరాలుగా, పాఠశాల సగటు వయసు 6.3 సంవత్సరాలుగా, తలసరి స్థూల జాతీయాదాయం (పీపీపీ 2011) 5663 డాలర్లుగా నమోదయ్యాయి.
- భారత్‌కు సంబంధించి అసమానతలను సర్దుబాటు చేసిన మానవాభివృద్ధి సూచీ విలువ 2015లో 0.454 కాగా, మానవాభివృద్ధిలో జరిగిన నష్టం 27.2 శాతంగా ఉంది. 2010-15 కాలానికి సంబంధించి ఆయుఃప్రమాణంలో అసమానతలు 24 శాతం కాగా, 2015లో అసమానతలు సర్దుబాటు చేసిన ఆయుఃప్రమాణ సూచీ విలువ 0.565. విద్యలో అసమానత 39.4 శాతం (2015) కాగా, 2015లో అసమానతలు సర్దుబాటు చేసిన ఎడ్యుకేషన్ సూచీ విలువ 0.324. ఆదాయంలో అసమానత 2015లో 16.1 శాతం కాగా, 2015లో అసమానతలు సర్దుబాటు చేసిన ఆదాయ సూచీ విలువ 0.512. గినీ గుణకం 2010-15లో 35.2గా నమోదైంది.
- యూఎన్‌డీపీ 188 దేశాలతో లింగ సంబంధిత అభివృద్ధి సూచీని రూపొందించింది. నార్వేకు సంబంధించి 2015లో ఈ సూచీ విలువ 0.993 కాగా, భారత్ విలువ 0.819. ఈ సూచీలో భారతదేశం గ్రూప్ 5లో ఉంది. పురుషులకు సంబంధించి మానవాభివృద్ధి సూచీ విలువ 2015లో 0.671 కాగా, మహిళల విలువ 0.549.
- 2015లో పురుషుల ఆయుఃప్రమాణం 66.9 సంవత్సరాలుగా ఉంటే మహిళల ఆయుఃప్రమాణం 69.9 సంవత్సరాలుగా ఉంది. 2015లో పురుషుల ఎక్స్‌పెక్టెడ్ ఇయర్‌స ఆఫ్ స్కూలింగ్ 11.3 సంవత్సరాలు కాగా, మహిళలకు 11.9 సంవత్సరాలుగా ఉంది.
- అంచనావేసిన తలసరి స్థూల జాతీయాదాయం (పీపీపీ 2011) పురుషుల విషయంలో 8897 డాలర్లు కాగా, మహిళల విషయంలో 2184 డాలర్లుగా ఉంది.
- లింగ సంబంధిత అసమానతల సూచీలో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానం పొందగా, నార్వే 6వ స్థానాన్ని, భారత్ 125వ స్థానాన్ని పొందాయి. భారతదేశ లింగ సంబంధిత అసమానతల సూచీ విలువ 0.530. భారతదేశానికి సంబంధించి ప్రసూతి మరణాలు ప్రతి లక్ష జనాభాకు 174 (2015). పార్లమెంటు సభ్యుల్లో మహిళల వాటా 12.2 శాతం (2015). పురుషులకు సంబంధించి 2015లో శ్రామికశక్తి భాగస్వామ్య రేటు 79.1 శాతం కాగా, మహిళలకు సంబంధించి 26.8 శాతంగా ఉంది.
- అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి యూఎన్‌డీపీ బహుమితీయ పేదరిక సూచీని లెక్కించింది. ఈ సూచీలో భారతదేశ విలువ 0.282గా ఉంది. తలల లెక్కింపు నిష్పత్తి ఆధారంగా (2005-06లో) భారతదేశంలో బహుమితీయ పేదరికంలో ఉన్నవారు 55.3 శాతం కాగా, వారి సంఖ్య 64,23,91,000 (64.23 కోట్లు)గా ఉంది. బహుమితీయ పేదరికానికి దగ్గరగా ఉన్న జనాభా 18.2 శాతం కాగా, తీవ్రమైన బహుమితీయ పేదరికంలో ఉన్న జనాభా 27.8 శాతం.
భారతదేశం-నివేదిక
ఆరోగ్యం
మహిళల్లో ప్రతి వెయ్యి జనాభాకు సంబంధించి వయోజన మరణరేటు 145 కాగా, పురుషుల్లో 217.
- ప్రతి వెయ్యి జననాలకు శిశు మరణాల రేటు 37.9. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో 1.4 శాతంగా ఉంది.
విద్య
15 సంవత్సరాలు అంతకు పైబడిన వారిలో వయోజన అక్షరాస్యత రేటు 72.1 శాతం. విద్యపై ప్రభుత్వరంగ వ్యయం.. జీడీపీలో 3.8 శాతం. 25 సంవత్సరాలకు పైబడిన వారిలో కనీసం సెకండరీ విద్యను అభ్యసించినవారు 48.7 శాతం కాగా, ప్రాథమిక పాఠశాల్లో విద్యార్థి-టీచరు నిష్పత్తి 1:32గా (ప్రతి టీచరుకు 32 మంది విద్యార్థులు) ఉంది.
ఆదాయం
సర్దుబాటు చేసిన నికర పొదుపు స్థూల జాతీయాదాయంలో 19 శాతం కాగా, విత్త రంగం వాటా దేశీయ పరపతిలో(జీడీపీలో) 76.8 శాతం.
- తలసరి స్థూల దేశీయోత్పత్తి (2011 ిపీపీపీ) 5730 డాలర్లు కాగా, స్థూల దేశీయోత్పత్తి (2011 పీపీపీ) 7512.5 బిలియన్ డాలర్లు. స్థూల స్థిర మూల ధన సంచయనం స్థూల దేశీయోత్పత్తిలో 30.8 శాతంగా ఉంది.
పని, ఉపాధి
15 సంవత్సారాలు, అంతకు పైబడిన వారిలో ఉపాధి పొందుతున్నవారు 51.9 శాతంగా ఉన్నారు. 5 నుంచి 14 సంవత్సరాల వయోవర్గంలో బాలకార్మికులు 12 శాతం. మొత్తం ఉపాధిలో వ్యవసాయ రంగ వాటా 49.7 శాతం కాగా, సేవారంగ వాటా 28.7 శాతం.
- 15 సంవత్సారాలు, అంతకు పైబడిన వారిలో శ్రామికశక్తి భాగస్వామ్య రేటు 53.7 శాతం.
- దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు 3.5 శాతం. మొత్తం ఉపాధిలో అసంఘటిత రంగ ఉపాధి శాతం 80.8 శాతం
- 15 నుంచి 24 సంవత్సరాల వయోవర్గంలోని యువకుల్లో పాఠశాలలో కానీ, ఉపాధిలో కానీ లేనివారు 27.2 శాతం. యువతలో(15 నుంచి 24 సంవత్సరాలు) నిరుద్యోగితా రేటు 9.7 శాతం.
వాణిజ్యం, విత్త ప్రవాహాలు
స్థూల దేశీయోత్పత్తిలో ఎగుమతులు, దిగుమతులు 48.8 శాతం. ఎగుమతులకు సంబంధించి concentration Index 0.175గా ఉంది. స్థూల జాతీయాదాయంలో విదేశీ రుణం 22.7 శాతం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నికర ప్రవాహాలు జీడీపీలో 2.1 శాతంగా ఉన్నాయి.
- స్థూల జాతీయాదాయంలో నికర అధికార అభివృద్ధి సహాయం 0.1 శాతం కాగా, స్థూల దేశీయోత్పత్తిలో ప్రైవేటు మూలధన ప్రవాహాలను 3 శాతంగా నివేదిక పేర్కొంది.
సమాచారం
దేశ జనాభాలో 26 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ప్రతి 100 మందిలో 78.8 శాతం మంది మొబైల్ పోన్లు కలిగి ఉన్నారు. నికర వలసరేటు ప్రతి వెయ్యి జనాభాకు - 0.4గా ఉంది.
పర్యావరణ సుస్థిరత
తలసరి కార్బన్ డైఆక్సైడ్ విడుదల 1.6 టన్నులు కాగా, మొత్తం భూ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 23.8 శాతం. 1990-2015 మధ్యకాలంలో అటవీ విస్తీర్ణంలో మార్పు 10.5 శాతం. మొత్తం అంతిమశక్తి వినియోగంలో పునరుత్పాదక శక్తి వినియోగం 39 శాతం. స్థూల జాతీయాదాయంలో సహజ వనరుల క్షీణత 2.9 శాతం.
Published date : 18 May 2017 08:49PM