Skip to main content

ఫార్మసీ రంగానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఆఫర్‌ చేసే విశ్వవిద్యాలయాలను తెలపండి.

- రవిచంద్ర, గార్ల.
Question
ఫార్మసీ రంగానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఆఫర్‌ చేసే విశ్వవిద్యాలయాలను తెలపండి.
ఫార్మసీ రంగం ప్రధానంగా జౌషధ పరిశోధన- అభివృద్ధి, వ్యాపార వ్యవహారాల నిర్వహణలో మంచి అవకాశాలను అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులకు ఔషధాలను కనిపెట్టడం, వాటిని తక్కువ ధరకు మార్కెట్లో ప్రవేశ పెట్టడం ఫార్మసీ తయారీ కంపెనీలకు ఇపుడు పెద్ద సవాలుగా మారింది. ఔషధాల తయారీలో నాణ్యత, సరైన వ్యాపార మెలకువలు పాటించడం అనివార్యమైంది. అందుకే నేడు పలు దేశీయ, విదేశీ కంపెనీలు ఔషధ పరిశోధన- అభివృద్ధి/పరీక్ష విధానం, మౌలిక వసతులు, తయారీ నైపుణ్యం, వ్యాపార పద్ధతులు, ధర నిర్ణయం వంటి విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్థలు ఫార్మసీ రంగంలో మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడం ద్వారా ఫార్మాస్యుటికల్‌, కెమికల్‌, బయో టెక్నాలజీ సంస్థలు, పరిశోధన, విద్యాసంస్థల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఆఫర్‌ చేస్తోన్న సంస్థలు:
-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యుటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, పంజాబ్‌-ఎంబీఏ(ఫార్మా) కోర్సు అందిస్తోంది. బీఫార్మసీ/బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌)/ ఎంఎస్సీ(లైఫ్‌ సెన్సైస్‌/కెమికల్‌ సైన్స్‌) పూర్తి చేసిన వారు అర్హులు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.niper.nic.in

-నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ముంబై-ఎంబీఏ(ఫార్మాస్యుటికల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సును అందిస్తోంది. కనీసం 50 శాతం మార్కులతో లైఫ్‌ సైన్స్‌/ బయోమెడిసిన్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌/ ఫార్మసీ/ మెడిసిన్‌తో గ్రాడ్యుయేషన్‌/పోస్టుగ్రాడ్యుయేషన్‌, లేదా సోషియాలజీ/ సైకాలజీ/ ఆంత్రోపాలజీల్లో ఏవైనా రెండు అంశాలతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, కంప్యూటర్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.nmims.edu

-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యుటికల్‌ మార్కెటింగ్‌, లక్నో - పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఫార్మామార్కెటింగ్‌) సెల్ఫ్‌ స్టడీ పద్ధతిలో అందిస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చే సిన వారు అర్హులు.
వెబ్‌సైట్‌: www.iipmindia.com
-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌, లక్నో- పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఫార్మా మార్కెటింగ్‌)ను దూరవిద్యా విధానంలో ఆఫర్‌ చేస్తోంది. అర్హత-ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: www.iictindia.com

Photo Stories