ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీలో ఎంటెక్ చేశాను. తర్వాత ఏం చేయాలి?
- సత్య, నెల్లూరు
Question
ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీలో ఎంటెక్ చేశాను. తర్వాత ఏం చేయాలి?
మీ ముందు రెండు అవకాశాలు. అవి ఉద్యోగ ప్రయత్నం, పరిశోధన రంగంలో అడుగు పెట్టడం. ఉద్యోగమే లక్ష్యమైతే ఫార్మాస్యుటికల్ కంపెనీలు, క్వాలిటీ కంట్రోల్ యూనిట్లు, ప్రభుత్వ ఏజెన్సీల్లో అవకాశాలుంటాయి. రీసెర్చ్ వైపు వెళ్లాలంటే.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా పరిశోధన సంస్థలకు దరఖాస్తు చేయొచ్చు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల్లో ఆసక్తి ఉన్న వారిని స్పాన్సర్ చేసి రీసెర్చ్‌కి పంపిస్తాయి. వాటిలో చేరడం ప్రయోజనకరం. బెంగళూరులోని అల్-అమీన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫర్ చేస్తోన్న ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీలో కూడా చేరవచ్చు. వెబ్‌సైట్: www.alameenpharmacy.edu