Skip to main content

ఫార్మ్‌-డి కోర్సు వివరాలను తెలపండి?

- శ్రావణ్‌, పెద్దపల్లి.
Question
ఫార్మ్‌-డి కోర్సు వివరాలను తెలపండి?
ఫార్మసీ విద్యకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కోర్సులు పరిశ్రమ అవసరాలను తీర్చేవిధంగా లేవనే భావనతో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా.. 2008లో ప్రవేశపెట్టిన వినూత్న కోర్సే.. డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ(ఫార్మ్‌.డి). ఈ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్లినికల్‌ థెరపీ, ఫార్మకోథెరపీ, క్లినికల్‌ రీసెర్చ్‌, కమ్యూనిటీ ఫార్మసీ వంటి కార్యకలాపాల్లో సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఫార్మ్‌.డి. కోర్సు దాదాపు ఎం.ఫార్మ్‌.తో సమానమైదని చెప్పొచ్చు. థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు కూడా ఆరేళ్ల ఈ కోర్సులో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇందులో ఐదేళ్లు క్లాస్‌ రూం టీచింగ్‌, ప్రాక్టికల్స్‌ సమ్మిళితంగా ఉంటుంది. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్‌.
 ఫార్మ్‌.డి.కోర్సుకు అర్హత: ఇంటర్మీడియెట్‌(ఎంపీసీ, బైపీసీ). ఎంసెట్‌ ర్యాంక్‌ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. బీఫార్మసీ విద్యార్థులకు ఫార్మ్‌-డి కోర్సులో లేటరల్‌ ఎంట్రీ విధానంలో... నేరుగా నాలుగో సంవత్సరంలో ప్రవేశం లభిస్తుంది. దీన్ని ‘పోస్ట్‌ బ్యాకులరేట్‌ ప్రోగ్రామ్‌’గా వ్యవహరిస్తారు. ఇందుకోసం బీ ఫార్మసీ ఉత్తీర్ణులు పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) రాయాలి.

Photo Stories