నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) అందించే కోర్సుల వివరాలను తెలపండి?
సతీష్, నల్లగొండ.
Question
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) అందించే కోర్సుల వివరాలను తెలపండి?
భారత ప్రభుత్వ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) పని చేస్తుంది. దీనికి ..మొహాలీ, హైదరాబాద్, హాజీపూర్, గౌహతి, రాయ్‌బరేలీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఏడు క్యాంపస్‌లకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి ప్రత్యేకంగా మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఉంటాయి. ఈ క్రమంలో నైపర్-హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు మాస్టర్, పీహెచ్‌డీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.
మాస్టర్ విభాగంలో ఎంఎస్(ఫార్మా), ఎంటెక్ (ఫార్మా), ఎంఫార్మసీ కోర్సులు ఉన్నాయి. స్పెషలైజేషన్స్:
క్లినికల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివెజైస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ,ఫార్మాస్యూటిక్స్, ఫార్మకోఇన్ఫర్మాటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్ మెడిసిన్.
ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్) పీహెచ్‌డీ స్పెషలైజేషన్స్:
కెమికల్ సెన్సైస్, బయాలజికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్.
మాస్టర్ కోర్సుల్లో నైపర్-జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంబీఏ కోర్సుకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అనే మూడు దశలు ఉంటాయి. ఎంబీఏతో కలిపి అన్ని మాస్టర్ కోర్సులకు ఒకే పరీక్షను నిర్వహిస్తారు. పీహెచ్‌డీ కోర్సులకు మాత్రం నైపర్-జేఈఈ, ఇంటర్వ్యూ అనే రెండు దశల విధానాన్ని అనుసరిస్తారు. ప్రవేశ ప్రక్రియ మొత్తం నైపర్-మొహాలీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
వివరాలకు: www.niper.ac.in