ఇంటర్ చదువుతున్నాను. ఫార్మ్-డి కోర్సు వివరాలు తెలపండి?
- అలీ పాషా, నూజివీడు
Question
ఇంటర్ చదువుతున్నాను. ఫార్మ్-డి కోర్సు వివరాలు తెలపండి?
భారత్‌లో ఫార్మా రంగం శరవేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఈ రంగంలో పరిశోధనలు రోజురోజుకూ విస్తృతమవుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఆ స్థాయిలో కావాల్సిన ఫార్మా కోర్సులు అందుబాటులో లేవు. దాంతో వాస్తవ స్థితిని గమనించిన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియూ... మన దేశంలో ‘ఫార్మ్-డి’ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు క్లినికల్ థెరఫీ, ఫార్మాకోథెరఫీ, క్లినికల్ రీసెర్చ్, కమ్యూనిటీ ఫార్మసీ వంటి కార్యకలాపాలు నిర్వర్తించే నైపుణ్యం కలిగి ఉంటారు.
ఇది ఆరేళ్ల కోర్సు. ఇందులో ఐదేళ్ల పాటు క్లాస్‌రూం టీచింగ్, ప్రాక్టికల్స్ ఉంటారుు. చివరి ఏడాది ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ చదివిన అభ్యర్థులు, లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ (డి.ఫార్మసీ) ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. ఎంసెట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారికి ఆసుపత్రులు, క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, డ్రగ్ డవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ఫార్మసీ విభాగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా... దేశంలో భారీ, చిన్నతరహా బల్క్ డ్రగ్ కంపెనీలు రెండొందలున్నాయి. వీటిలో దాదాపు ఐదొందల ఫార్ములేషన్ యూనిట్లున్నాయి. అందువల్ల ఉపాధి విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. వెబ్‌సైట్: www.pci.nic.in