ఎంఎస్సీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి?
రాజేష్, హైదరాబాద్.
Question
ఎంఎస్సీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి?
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పీజీ చేసిన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైైవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్‌లో విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్‌టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. సస్టెయినబిలిటీ డెవలప్‌మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అంశాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రీసోర్సెస్, అగ్రికల్చరల్ తదితర ఏజెన్సీలు/సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి.
అందిస్తున్న యూనివర్సిటీలు:
అందిస్తున్న యూనివర్సిటీలు:
- ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.osmania.ac.in
- శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.svuniversity.in
- ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in