Skip to main content

SHRESHTA 2024 Admissions: విద్యార్థులకు ఉచితంగా ‘శ్రేష్ట’మైన విద్య.. దరఖాస్తు చేసుకోండి..

అనంతపురం సిటీ: విద్యార్థుల ఉజ్జ్వల భవిత కోసం ప్రవేశపెట్టిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. 'నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ట–నెట్స్‌ 2024' పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరణ నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.
National Entrance Test announcement  Anantapuram City  SHRESHTA NETS 2024 Registration Process Starts   National Testing Agency

ఈ పథకానికి ఎస్సీ బాల బాలికలు నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు జెడ్పీ సాంఘిక సంక్షేమ శాఖల స్థాయీ సంఘాల చైర్‌పర్సన్‌ నాగ రత్నమ్మ ఏప్రిల్ 1వ తేదీ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేటు విద్యాసంస్థల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మే 12 నుంచి అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయి. వీటిని https://exams.nta.ac.in/SHRESHTA వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని మే 24న జరిగే రాత పరీక్షకు హాజరు కావచ్చు.

National Testing Agency: నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ట-నెట్స్‌ 2024

Published date : 02 Apr 2024 12:44PM

Photo Stories