Skip to main content

మెడికల్‌ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల

మెడికల్‌ కాలేజీల్లో ఆల్‌ ఇండియా కోటా, రాష్ట్ర స్థాయి ప్రవేశాలకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఆక్టోబర్‌ 3న షెడ్యూల్‌ విడుదల చేసింది ఆక్టోబర్‌ 11 నుంచి ఆల్‌ ఇండియా స్థాయిలో, 17 నుంచి రాష్ట్రంలో ప్రవేశ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి.
Schedule of Medical Admissions
మెడికల్‌ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల

నవంబర్‌ 15 నుంచి క్లాసులు ప్రారంభం కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆల్‌ ఇండియా కోటాలో మొదటి విడత ప్రవేశ ప్రక్రియ ఆక్టోబర్‌ 11 నుంచి 20 వరకూ నిర్వహిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆక్టోబర్‌ 22 నుంచి 28వ తేదీ వరకూ ఆయా కాలేజీల్లో చేరడానికి చివరి తేదీగా నిర్ణయించారు. రెండో విడత ప్రవేశాలు నవంబర్‌ 2 నుంచి 10 వరకూ కొనసాగుతాయి. సీట్లు పొందినవారు నవంబర్‌ 12 నుంచి 18 వరకూ ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 1 వరకు జరిగే మాప్‌ అప్‌ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబర్‌ 4 నుంచి 10 వరకూ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో.. ఆక్టోబర్‌ 17 నుంచి 28 వరకూ మొదటి విడత కౌన్సెలింగ్‌ ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్‌ 4 లోగా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ నవంబర్‌ 7 నుంచి 18 వరకూ జరుగుతుంది. మాప్‌ అప్‌ రౌండ్‌ డిసెంబర్‌ 6 నుంచి 12 వరకూ నిర్వహిస్తారు. ఇందులో సీట్లు పొందిన వారు డిసెంబర్‌ 16 లోగా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. డిసెంబరు 20లోపు అన్ని విడతల ప్రవేశాలను పూర్తి చేయాలని జాతీయ వైద్య కమిషన్‌ స్పష్టం చేసింది.

చదవండి: 

ప్రైవేటు మెడికల్ సీట్లలో రిజర్వేషన్ .. రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం

Published date : 04 Oct 2022 01:28PM

Photo Stories