Skip to main content

పీజీ అభ్యర్థుల తొలిజాబితా

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, సోషల్‌ వర్క్‌ తదితర పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థుల తొలిజాబితాను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు సీపీజీఈటీ–2021 కనీ్వనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు.
పీజీ అభ్యర్థుల తొలిజాబితా
పీజీ అభ్యర్థుల తొలిజాబితా

సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును నవంబర్ 21న ప్రకటించారు. కౌన్సెలింగ్‌లో భాగంగా... నవంబర్‌ 22న రిజి్రస్టేషన్లు, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ గడువు ముగియనుంది. వెరిఫికేషన్ పూర్తి అయిన అభ్యర్థుల జాబితాను 26న వెల్లడించనున్నారు. వెరిఫికేషన్లలో అభ్యంతరాలు ఉంటే నవంబర్‌ 27, 28 తేదీలలో తెలియజేయాల్సి ఉంటుంది. నవంబర్‌ 29 నుంచి డిసెంబరు 2 వరకు వెబ్‌ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ఆప్షన్స్ లో తప్పులను ఎడిట్‌ చేసేందుకు అవకాశం కలి్పంచనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం ఓయూతో పాటు ఏడు యూనివర్సిటీలలో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు తొలిజాబితాను డిసెంబరు 6న ప్రకటిస్తామని ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు.

చదవండి: 

Education: ఉపాధి వేటలో విజయం సాధించేలా కోర్సులు

Collector: అమ్మా నాన్న లేని బిడ్డ.. అండగా నేనుంటా

ఇకపై పాఠాలు.. ప్రాక్టికల్‌గా..సరికొత్త విద్యా ప్రణాళిక వైపు తెలంగాణ అడుగులు

Published date : 22 Nov 2021 01:44PM

Photo Stories