RGUKT: టిపుల్ ఐటీలో అడ్మిషన్ల కోసం దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణకు జూన్ 26తో గడువు ముగియనుంది.
అడ్మిషన్లకు జూన్ 4న నోటిఫికేషన్ విడుదల చేయగా, 26వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో కలిపి 4,400 సీట్లు ఉండగా, జూన్ 25 సాయంత్రానికి 35,500ల దరఖాస్తులు వచ్చినట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
చదవండి: RGUKT (IIIT) Basara: సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు.. నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తులు ఇలా..
కొందరు పదో తరగతి విద్యార్థులు తమ మార్కుల రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని, వారు తమ మార్కులు పెరిగితే ఆ వివరాలను జూలై 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు నోటిఫికేషన్‌లో ఇచ్చిన మెయిల్ ఐడీకి మెయిల్ చేస్తే వారి దరఖాస్తు ఫారంలో అప్‌డేట్ చేస్తామని వివరించారు.
Published date : 26 Jun 2023 04:04PM