AP DEd: డీఎడ్, పండిట్ స్పాట్ అడ్మిషన్ల అభ్యర్థులకు త్వరలో పరీక్షలు
- వైఎస్సార్ టీఎఫ్ వినతిపై మంత్రి హామీ
- డీఎడ్, పండిట్ స్పాట్ అడ్మిషన్ల
- అభ్యర్థులకు త్వరలో పరీక్షలు
సాక్షి, అమరావతి: 2018–20 సంవత్సరాలకు సంబంధించిన డీఎడ్ బ్యాచ్ విద్యార్థుల్లో పరీక్షలకు నోచుకోని వారికి త్వరలోనే పరీక్షలకు అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.జాలిరెడ్డి డిసెంబర్ 8న ఒక ప్రకటనలో తెలిపారు. 650 ప్రయివేటు డీఎడ్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల కింద చేరిన 27,500 మంది, లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో చేరిన 3 వేల మందిని ఇంతకు ముందు జరిగిన ఫైనల్ పరీక్షలకు అనుమతించలేదు. ఫలితంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మంత్రికి విన్నవించామని జాలిరెడ్డి చెప్పారు. ఈ విద్యార్థులకు త్వరలోనే ఫైనల్ పరీక్షలు నిర్వహించేలా ఉత్తర్వులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రి హామీపై వైఎస్సార్‌టీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది.
Jobs: 22 వేల బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు