TS TET: దరఖాస్తుల వెల్లువ.. పూర్తి వివరాలు చూడండి
గడువు ముగిసేలోగా ఇవి 4 లక్షలకు చేరే వీలుందని భావిస్తున్నారు. జూన్ 12న జరిగే టెట్ పరీక్షకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 26 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఇది ఏప్రిల్ 16తో ముగుస్తుంది. సర్వర్ సరిగా పనిచేయక దరఖాస్తుదారులకు తొలి రెండు రోజులు సాంకేతిక సమస్యలు తెలెత్తాయి. దీంతో మార్చి 28 నుంచి దరఖాస్తుల వేగం పెరిగింది.
చదవండి:
భాషా పండితుల కోసం టెట్‌లో ఈ పేపర్‌ని పరిశీలిస్తున్నాం
టెట్ సిలబస్ ఇదే.. ఎవరు రాయొచ్చు అంటే..?
బీఎడ్ అభ్యర్థులకు కలిసొచ్చిన అవకాశం
ఈసారి టెట్‌లో కొన్ని వెసులుబాట్లు కల్పించారు. గతంలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే టెట్ పేపర్–1 రాసేవాళ్లు. దీనిద్వారా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులయ్యేవారు. బీఈడీ పూర్తి చేసిన వాళ్లు టెట్ పేపర్–2 రాసి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉండేది. అయితే, ఈసారి బీఎడ్ అభ్యర్థులు రెండు పేపర్లూ రాయొచ్చు. దీంతో ఎస్‌జీటీ బోధించేందుకూ అర్హులవుతారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,086 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే, అందులో 6,700 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పోటీ పడే అవకాశం బీఈడీ విద్యార్థులకు ఉంటుంది. ఈ కారణంగా బీఈడీ అభ్యర్థుల నుంచి రెండు పేపర్లకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.
వెబ్‌సైట్ ద్వారా పాత సర్టిఫికెట్లు
టెట్ అర్హత సర్టిఫికెట్‌ను జీవిత కాలం చెల్లుబాటు అవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు, ప్రైవేటులోనూ టెట్ తప్పనిసరని కేంద్రం పేర్కొంది. గతంలో టెట్ సరి్టఫికెట్ కేవలం ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటయ్యేది. ఈ విధానాన్ని మార్చడంతో డీఎడ్, బీఎడ్ విద్యార్థులు టెట్ రాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు 2011 నుంచి టెట్‌కు జీవిత కాలం చెల్లుబాటు నిబంధన వర్తిస్తుందని చెప్పడంతో ఆయా అభ్యర్థులు పాత సరి్టఫికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఏప్రిల్ 1 వరకు వచ్చిన దరఖాస్తులు
టెట్ పేపర్–1 |
1,04,336 |
టెట్ పేపర్–2 |
76,469 |
మొత్తం |
1,80,805 |