VTG CET 2022: గురుకులాల ఉమ్మడి ప్రవేశపరీక్ష తేదీలు
Sakshi Education
గురుకుల పాఠశాలల్లోని ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష(వీటీజీ సెట్–2022) మే 8న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 415 పరీక్షాకేంద్రాల్లో ఏర్పాట్లను గురుకులాలు పూర్తి చేశాయి. 1,47,924 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో బాలికలు 70,201, బాలురు 77,723 ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను విరివిగా ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో ప్రవేశాలకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో దరఖాస్తులు సైతం భారీగా వస్తున్నాయి. ఒక్కో సీటుకు సగటున నలుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు.
సొసైటీలవారీగా గురుకుల పాఠశాలలు, సీట్లు
సొసైటీ |
పాఠశాలలు |
సీట్లు |
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ |
230 |
18,400 |
టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ |
77 |
6,080 |
టీఎస్‌ఆర్‌ఈఐఎస్ |
35 |
2,840 |
ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ |
261 |
20,800 |
Published date : 06 May 2022 03:27PM