Skip to main content

JEE and NEET: ఎస్సీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు.
Free training in JEE and NEET for SC students
ఎస్సీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

విద్యార్థులు విజయాలు సాధించడానికి అవసరమైన ప్రతి సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల ఆధ్వర్యంలో ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ జేఈఈ, నీట్‌కు షార్ట్‌ టర్మ్‌ కోచింగ్‌ను వర్చువల్‌ విధానం ద్వారా మే 23న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. గతంలో మూడు కేంద్రాల్లోనే శిక్షణ ఇవ్వగా.. 2022 నుంచి 8 కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. బాలికలకు మధురవాడ (విశాఖ), ఈడ్పుగల్లు (పెనమలూరు), సింగరాయకొండ (ప్రకాశం), చిన్నచౌక్‌ (కడప)లలో ఉచిత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే బాలురకు కొత్తూరు (అనపర్తి), చిల్లకూరు (నెల్లూరు), అడవి తక్కెళ్లపాడు (గుంటూరు), చిన్నటేకూరు (కర్నూలు)ల్లో ఇస్తున్నామని తెలిపారు. వీటిలో ఎస్సీ విద్యార్థులకు ఆన్ లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో శిక్షణ ఉంటుందన్నారు. అంబేడ్కర్‌ గురుకులాల ఆధ్వర్యంలో ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒకటి చొప్పున పోటీ పరీక్షల కేంద్రాలను ప్రారంభించడానికి కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా కేంద్రాల్లోని కొందరు విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడారు. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి పావనమూర్తి పాల్గొన్నారు.

చదవండి: 

NEET - Quick Review  | Guidance | Bit Bank | Model Papers | Guest Speaks | Cut-Off Ranks

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) గైడెన్స్

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) వీడియో గైడెన్స్

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) ప్రివియస్‌ పేపర్స్​​​​​​​

Sakshi Education Mobile App
Published date : 24 May 2022 02:43PM

Photo Stories