Skip to main content

సెంట్రల్‌ వర్సిటీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు యూజీసీ మొదటిసారిగా సీయూసెట్‌–2022 ద్వారా ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించనుంది.
CUCET 2022 Applications beginning
సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

దేశంలోని 54సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు నేటి నుంచి ఏప్రిల్‌ 30వరకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తు చేసుకుని, పరీక్షలో అర్హత సాధిస్తే.. దేశంలోని ఏ వర్సిటీలోనైనా చదువుకోవచ్చు. సీయూసెట్‌–2022 ద్వారా ఢిల్లీలోని జేఎన్ యూ, ఢిల్లీ యూనివర్సిటీ, వివిధ రాష్ట్రాల్లోని స్పోర్ట్స్, ఏవియేషన్, అగ్రికల్చర్‌ సెంట్రల్‌ వర్సిటీలు, తెలంగాణలోని హెచ్‌సీయూ, మౌలానా ఆజాద్‌ ఉర్దూ వర్సిటీ, ఇఫ్లూ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీ సెంట్రల్‌ వర్సిటీ, ట్రైబల్‌ వర్సిటీ, సంస్కృత యూనివర్సిటీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందవచ్చు.

Sakshi Education Mobile App
Published date : 02 Apr 2022 05:08PM

Photo Stories