Skip to main content

CPGET 2022: పీజీ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ సమాచారం

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లోని పలు పీజీ కోర్సుల్లో 2022–23 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సెప్టెంబర్‌ 27 నుంచి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.
CPGET 2022
పీజీ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ సమాచారం

CPGET–2022లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆక్టోబర్‌ 8 వరకు పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కన్వీనర్‌ పాండురంగారెడ్డి సెప్టెంబర్‌ 27న తెలిపారు. వెబ్‌ ఆప్షన్స్‌ అక్టోబరు 12 నుంచి 15 వరకు ఇవ్వాలని సూచించారు. ఓయూతో పాటు కాకతీయ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా వర్సిటీ యూనివర్సిటీల క్యాంపస్‌ కాలేజీతో పాటు అనుబంధ, ప్రైవేటు కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఎల్‌ఐసీ, పీజీ డిప్లొమాలు, ఐదేళ్ల పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందుకు ఎసెస్సీ, ఇంటర్, డిగ్రీ పాస్‌ సర్టిఫికెట్‌తో పాటు టీసీ, కులం, ఆదాయం, లోకల్‌ ఏరియా సర్టిఫికెట్లను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. వివరాలకు www.osmania.ac.inను సందర్శించాలని సూచించారు. 

చదవండి: 

ఐఐటీకి 610, ఓయూకు 1400 ర్యాంకు

NBA: ఓయూ ఇంజనీరింగ్‌ పీజీ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు

Published date : 28 Sep 2022 03:20PM

Photo Stories