ఐఐటీకి 610, ఓయూకు 1400 ర్యాంకు
Sakshi Education
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల పనితీరును విశ్లేషించే యూకే సంస్థ క్వాక్వరెల్లీ సిమండ్స్ (క్యూఎస్) ఏటా ప్రకటించే యూనివర్సిటీ ర్యాంకుల్లో ఈసారి Osmania University, IIT Hyderabad కాస్త వెనకబడ్డాయి.
2021లో హైదాబాద్ ఐఐటీ 591 ర్యాంకు, OU 1200 ర్యాంకు సాధించగా 2022లో IIT(H) 601–610 శ్రేణిలో ర్యాంకు, OU 1201–1400 శ్రేణిలో ర్యాంకుకు పరిమిత మయ్యాయి. ఆసియా స్థాయిలో IIT(H) కు 351–400 కేటగిరీలో ర్యాంకు లభించింది. అలాగే University of Hyderabad 751–800 శ్రేణిలో ర్యాంక్ సాధించింది. దేశానికి చెందిన 35 వర్సిటీలు గతేడాది ర్యాంకింగ్స్ జాబితాలో స్థానం సంపాదించగా ఈసారి వాటి సంఖ్య 41కి పెరిగింది. బెంగళూరుకు చెందిన Indian Institute of Science (IISC) 155వ అంతర్జాతీయ ర్యాంకుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. విద్యాపరమైన విశ్వసనీయత, ఉపాధి అవకాశాలు, నాణ్యమైన, ప్రమాణాలతో కూడిన బోధనా విధానం, అధ్యాపకులు– విద్యార్థుల శాతం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠ్య ప్రణాళిక ఇలా అనేక అంశాలను పరిగణన లోకి తీసుకొని క్యూఎస్ ర్యాంకులు ప్రకటిస్తుంది.
చదవండి:
Published date : 10 Jun 2022 04:47PM