Skip to main content

APPGCET: ఏపీపీజీసెట్‌ ఫలితాలు

ఏపీపీజీసెట్‌–2021 ఫలితాలు నవంబర్‌ 9న విడుదల కానున్నాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సు«దీర్‌ప్రేమ్‌కుమార్‌ నవంబర్‌ 8న ఒక ప్రకటనలో తెలిపారు.
APPGCET
ఏపీపీజీసెట్‌ ఫలితాలు

మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను సబ్జెక్టుల వారీగా అక్టోబర్‌ 22 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తొలిసారిగా అన్ని యూనివర్సిటీల్లోని ఎం.ఎ, ఎం.కామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 39,856 మంది రిజిస్టర్‌ కాగా, 35,573 మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి (సెట్స్‌) డాక్టర్‌ ఎం.సు«దీర్‌రెడ్డి తెలిపారు. 

చదవండి: 

KTR: కోయ బాలిక ఐఐటీ విద్య కోసం..కేటీఆర్‌ సాయం

JPS: జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టులు రాత పరీక్ష తేదీలు ఖరారు

Published date : 09 Nov 2021 12:16PM

Photo Stories