IIIT: ట్రిపుల్ ఐటీల్లో భారీగా ప్రవేశాలు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్‌లలో ఈ ఏడాది 4,400 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి చెప్పారు.
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు వచి్చన ఆయన అక్టోబర్ 13న విలేకరులతో మాట్లాడారు. ప్రతి క్యాంపస్‌లో 1000 సీట్లు, 100 సీట్లు ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కోటా కింద ప్రవేశాలు కలి్పంచనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 22 తర్వాత ప్రీ యూనివర్శిటీ (పీయూసీ ) మొదటి సంవత్సరం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. నవంబర్‌లో ప్రవేశాలు, డిసెంబర్ నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి, రెండు, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 175 మంది బోధన సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు.
చదవండి:
APPSC: ఉద్యోగాలు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
Good News: విద్యార్ధులకు నైపుణ్యాలను పెంపొందించేలా ఉచిత శిక్షణ
Published date : 14 Oct 2021 01:38PM