TS CPGET: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలో 94 శాతం అర్హత
Sakshi Education
రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CPGET)లో 94.39% అర్హత సాధించారు.
ఆగస్టు 11 నుంచి 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో విడుదల చేశారు. వారం రోజుల్లో పీజీ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పీజీ సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, సెట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
☛ సీపీజీఈటీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
సీపీజీఈటీకి రిజిస్టర్ చేసుకున్న వారు |
67,027 |
పరీక్షకు హాజరైన వారు |
57,262 |
అర్హత సాధించిన వారు |
54,050 |
అర్హత శాతం |
94.39 |
అర్హత సాధించిన పురుషులు |
17,613 |
అర్హత సాధించిన మహిళలు |
36,437 |
Published date : 21 Sep 2022 01:36PM