INI-CET: ఐఎన్‌ఐ సెట్‌లో మందరాడ వాసికి 155వ ర్యాంకు
Sakshi Education
రాజాం/సంతకవిటి: ఐఎన్‌ఐ(ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) సెట్ ఫలితాల్లో సంతకవిటి మండలం, మందరాడ గ్రామానికి చెందిన వావిలపల్లి చంద్రమౌళి ఆలిండియా విభాగంలో 155వ ర్యాంకు సాధించారు.
ఈ యువకుడు నవంబరు 5వ తేదీన జరిగిన మెడికల్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాయగా, నవంబర్ 11న ఫలితాలు వెలువడ్డాయి. పీజీలో జనరల్ మెడిసిన్ కోర్సు చేసేందుకు గాను ఈ పరీక్ష రాసినట్లు చంద్రమౌళి తెలిపారు. ఈయన 2017లో జరిగిన నీట్‌లో ఆలిండియా విభాగంలో 508వ ర్యాంకు సాధించి, విశాఖ కేజీహెచ్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు.
చదవండి: Child Rights Commission: పాఠశాల యాజమాన్యంపై కమిషన్ ఆగ్రహం
తాజాగా ఐఎన్‌ఐ సెట్‌లో కూడా ప్రతిభ చాటడంతో అందరూ అతడిని అభినందిస్తున్నారు. ఈయన తల్లి భాగ్యలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయిని కాగా, తండ్రి శ్రీనివాసరావు వైఎస్సార్ క్రాంతి పథం శాఖలో సీసీగా పనిచేస్తున్నారు.
Published date : 13 Nov 2023 12:56PM