Skip to main content

TS LPCET 2024 Notification: టీఎస్‌ ఎల్‌పీసెట్‌–2024 నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య–శిక్షణ మండలి.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి లేటరల్‌ ఎంట్రీ ఇన్‌ టూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎల్‌పీసెట్‌)–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రా­ష్ట్రంలోని పాలిటెక్నిక్‌/ఇన్‌స్టిట్యూషన్స్‌(ప్రభుత్వ/ఎయిడెడ్‌/అన్‌ఎయిడెyŠ /ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు)ల్లో రెండో సంవత్సరం డిప్లొమా కో­ర్సుల్లో ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్స్‌ కల్పిస్తారు.
LPSET-2024 Notification    Lateral Entry into Polytechnic Common Entrance Test announcement  TS LPCET 2024 Notification details     Telangana State Board of Technical Education and Training

డిప్లొమా విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ.

అర్హత: కనీసం 60శాతం మార్కులతో రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీఈటీ) నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.04.2024.
ప్రవేశపరీక్షతేది: 20.05.2024.

వెబ్‌సైట్‌: https://www.sbtet.telangana.gov.in/

చదవండి: AP ECET 2024 Notification: ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

Published date : 26 Mar 2024 03:58PM

Photo Stories