ఇంజనీరింగ్ మీద ఉన్న ఆసక్తితోనే..
Sakshi Education
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) - 2016లో తెలుగు విద్యార్థి కె.కె.శ్రీనివాస్ ఈసీ విభాగంలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. గేట్-2014లోనూ ఆయన నాలుగో స్థానంలో నిలవడం విశేషం. బిట్స్ పిలానీలో బీటెక్ చేసిన శ్రీనివాస్ క్యాట్ రాసి ఎంబీఏ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌పై ఆసక్తితో గేట్ రాశాడు. ఇంజనీరింగ్‌లో పీజీ చేయడానికి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి చాలా మంది గేట్ రాస్తుండటంతో పోటీ తీవ్రమైంది. ఈ నేపథ్యంలో గేట్‌లో రెండుసార్లు టాప్ ర్యాంక్ సాధించిన శ్రీనివాస్ ‘భవిత’తో తన అనుభవాలు పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
హైదరాబాద్‌కు చెందిన మా కుటుంబం ప్రస్తుతం బెంగళూరులో ఉంటోంది. నాన్న కె.వి.అనంత కృష్ణ శర్మ రిటైర్డ్ ఇంజనీర్, అమ్మ కె.విజయ గృహిణి. అమ్మానాన్నకు నేను ఒక్కడినే సంతానం. బేగంపేటలోని చిన్మయ విద్యాలయలో పదో తరగతి వరకు చదివాను. తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. 2011లో బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ నుంచి బీఈ (ఆనర్స్) ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ప్రాంగణ నియామకాల్లో రిలయన్స్ పవర్‌లో ఉద్యోగం వచ్చినా చేరలేదు. 2010లో క్యాట్‌కు, 2011లో గేట్‌కు హాజరయ్యాను. క్యాట్‌లో 96.77 పర్సంటైల్, గేట్‌లో 1504 ర్యాంకు వచ్చింది. ముంబైలోని కేజే సోమయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్‌లో రెండేళ్ల పీజీడీఎం (ఫైనాన్స్) కోర్సు పూర్తి చేశాను.
తిరిగి ఇంజనీరింగ్ వైపు ..
ఎంబీఏలో చేరినప్పటికీ నాకు ఇంజనీరింగ్ మీదే ఆసక్తి ఉంది. దాంతో తిరిగి గేట్‌కు ప్రిపేరయ్యా. గేట్ 2014లో నాలుగో ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంక్ ఆధారంగా 2015 మార్చిలో ఇస్రోకు చెందిన ఐఎస్‌టీఆర్‌ఏసీలో చేరాను. షిప్టుల్లో పనిచేయాల్సి రావడంతో ఆరోగ్యం దెబ్బతింది. దీంతో 2015 ఆగస్టులో ఇస్రోలో ఉద్యోగం వదులుకున్నాను. మరోసారి గేట్‌కు సన్నద్ధమై ఎంటెక్ చేయాలనుకున్నా. గేట్‌కు ప్రిపేర్ అవుతూనే ఓ ఇన్‌స్టిట్యూట్‌లో వారాంతాల్లో గేట్ ఫ్యాకల్టీగా కమ్యూనికేషన్స్ సబ్జెక్ట్ బోధించాను. ఇది గేట్ సన్నద్ధతకు ఉపకరించింది. దీంతో 2016 గేట్‌లో రెండో ర్యాంకు సాధించాను.
కాన్సెప్టుల అవగాహనతోనే...
కోర్ సబ్జెక్టులకు సంబంధించి మొదట ముఖ్య భావనలను, ఆయా అంశాల్లోని లాజిక్‌ను అవగతం చేసుకోవాలి. తర్వాతే ఆ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అన్ని కోర్ సబ్జెక్టులను ప్రాక్టీస్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి క్లిష్టంగా ఉన్న ఒకటి, రెండు సబ్జెక్టులను వదిలేయవచ్చు. జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు సులువుగా ఉంటాయి. ప్రాక్టీస్ చస్తే మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో క్యాట్ రాసిన అనుభవం ఉండటంతో జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులు పెద్దగా కష్టమనిపించలేదు.
మాక్‌టెస్ట్‌లతో టైం మేనేజ్‌మెంట్
మొదట నేను గత ప్రశ్నపత్రాల సాధనపై దృష్టిసారించకుండా సబ్జెక్టుల్లోని భావనలను అర్థం చేసుకున్నాను. పునశ్చరణకు సులువుగా ఉండేలా ఒక ఫార్ములా బుక్ సిద్ధం చేసుకున్నాను. పరీక్షకు రెండు నెలల ముందు నుంచే ఆన్‌లైన్ పరీక్షలకు హాజరయ్యాను. ఎక్కువగా మాక్ టెస్ట్‌లు రాయడం ఉపకరించింది. గేట్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు మొదట ప్రాథమిక స్థాయిలో పరీక్షలు రాయాలి. తర్వాత అడ్వాన్స్‌డ్ స్థాయిలో పరీక్షలు రాస్తే లాభిస్తుంది. తద్వారా టైం మేనేజ్‌మెంట్ కూడా అలవడుతుంది. అభ్యర్థులు వారి బలాలు, బలహీనతలను తెలుకొని ప్రిపరేషన్ సాగించాలి. టెక్నికల్ పేపర్లను ముందుగా సాల్వ్ చేయాలా? లేదా ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ సబ్జెక్టులను సాల్వ్ చేయడమా? అనేది వారి ఆసక్తి, సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. మాక్ టెస్టులు రాయడం ద్వారా అభ్యర్థులు తమ ఆసక్తులను తెలుసుకోగలుగుతారు.
కోచింగ్ అవసరమే..
కోచింగ్ తీసుకోవడం వల్ల పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుస్తుంది. బీటెక్‌లో కాన్సెప్టులు మాత్రమే నేర్చుకుంటారు. కోచింగ్‌లో గేట్ స్థాయి ప్రశ్నలకు వాటిని ఎలా అన్వయించాలో నేర్పుతారు. గేట్ కోసం చాలా సమయం కేటాయించాలి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ లేదా ఉద్యోగం చేస్తూ చదివే వారికి గేట్ సాధించడం కొంచెం కష్టమే. ఇతరత్రా వాటిపై దృష్టి పెట్టకుండా కేవలం గేట్ మీదే ఫోకస్ చేస్తే మంచి ర్యాంక్ సాధించవచ్చు.
సలహాలు..
అభ్యర్థులు సానుకూల దృక్పథంతో ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఇంజనీరింగ్‌లో మ్యాథ్స్ పార్ట్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎగ్జామ్‌కు ముందు రోజు కాన్సెప్టులను రివిజన్ చేసుకోవాలి. పరీక్షకు ముందు రోజు మాక్ టెస్ట్‌లు రాయకూడదు. సరిగా నిద్రపోవాలి. పరీక్ష రోజు ఎలాంటి రివిజన్ చేయకూడదు. ఎగ్జామ్ హాల్‌కు ఎలాంటి పుస్తకాలు తీసుకెళ్లకపోవడం ఉత్తమం. ఎలాంటి టెన్షన్ లేకుండా రిలాక్స్‌గా పరీక్షకు హాజరవ్వాలి. ‘నెవర్ గివ్ అప్’ అనే యాటిట్యూడ్‌తో ముందుకు సాగాలి.
ఐఐఎస్సీలో చేరుతా..
నాకు ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్ థియరీ (ఈఎంటీ) సబ్జెక్ట్ అంటే ఇష్టం కాబట్టి ఆర్‌ఎఫ్ అండ్ మైక్రోవేవ్స్ విభాగంలో కేరీర్ ఎంచుకోవాలనుకుంటున్నా. ఆర్‌ఎఫ్ అండ్ మైక్రోవేవ్స్ కోర్సు ఐఐఎస్సీ బెంగళూరులో లేదు కాబట్టి కమ్యూనికేషన్స్ అండ్ నెట్‌వర్క్స్‌లో ఎంటెక్ చేస్తా. కుదిరితే మైక్రోవేవ్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేస్తాను.
అకడమిక్ ప్రొఫైల్

పదో తరగతి | 93 శాతం |
ఇంటర్మీడియట్ | 98.1 శాతం |
ఐఐటీ ర్యాంక్ | 3210 |
ఏఐఈఈఈ | 795 |
ఎంసెట్ | 131 |
బిట్‌శాట్ స్కోరు | 317 |
ఎంసెట్ ర్యాంక్ | 12 |
బీటెక్ | 9.42 సీజీపీఏ |
ఎంబీఏ | 72 శాతం |
Published date : 24 Mar 2016 04:49PM