BTech & MTech Exam Results: బీటెక్, ఎంటెక్ పరీక్ష ఫలితాల విడుదల
Sakshi Education
నయీంనగర్: గ్రేటర్ వరంగల్ కిషన్‌పుర చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) యూజీ 3, 5 పీజీ 3 సెమిస్ట్టర్, బీటెక్, బీఫార్మసీ 3, 5, ఎంటెక్. ఎం.ఫార్మసీ 3 సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కులపతి డాక్టర్ సీహెచ్.వి.పురుషోత్తంరెడ్డి విడుదల చేశారు.
![BTech and MTech exam results Greater Warangal Kishanpura Chaitanya University](/sites/default/files/images/2025/02/05/btech-mtech-exam-results-1738730125.jpg)
యూజీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 9,69 మంది విద్యార్థు హాజరుకాగా.. 743 మంది, పీజీ 3వ సెమిస్టర్‌లో 234 మంది పరీక్షలకు హాజరుకాగా.. 203 మంది, బీటెక్, బీఫార్మసీ 3, 5వ సెమిస్టర్లలో 591 హాజరుకాగా 432 మంది, ఎంటెక్ 3వ సెమిస్టర్‌లో హాజరైన ఆరుగురు విద్యార్థులు, ఎం.ఫార్మసీ 3వ సెమిస్టర్‌లో హాజరైన 15 మంది ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం.రవీందర్, ఓఎస్‌డి. డా.వీరవెంకటయ్య, ఆచార్యులు జి.శంకర్‌లింగం, వి.మల్లికార్జున్, ఎస్.కవిత, ఎస్.సుమ, ఎం.జగదీశ్వర్, వివిధ శాఖాధిపతులు పాల్గొన్నారు.
Published date : 07 Feb 2024 08:27AM