కాలేజీ క్యాంపస్‌లో కుదురుకోండిలా..
Sakshi Education
కష్టపడి చదివి.. ఆపై ఇష్టమైన కోర్సులో చేరి.. ఇంటికి దూరంగా ఉంటూ కొత్త కాలేజీలో అడుగుపెట్టిన విద్యార్థికి కళ్ల ముందు సరికొత్త ప్రపంచం సాక్షాత్కారమవుతుంది.. అపరిచిత ముఖాలు పలకరిస్తాయి.. క్లాస్‌రూంలో కొత్త పాఠాలు ఎదురవుతాయి.. ఏదో తెలీని బెరుకుతనం తడబాటుకు గురిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు కొత్త వాతావరణానికి అలవాటుపడాలంటే ఏం చేయాలి? కాలేజీలో చేరింది మొదలు ఎలాంటి స్కిల్స్‌పై దృష్టిపెట్టాలి? రకరకాల సెట్‌లు ముగిసి విద్యార్థులు కొత్త కళాశాలల్లోకి అడుగుపెడుతున్న వేళ స్పెషల్ ఫోకస్..
ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంఏ, హోటల్ మేనేజ్‌మెంట్.. ఇలా విద్యార్థులు రకరకాల కోర్సుల్లో అడుగుపెడుతుంటారు. అప్పటివరకు ఇంటర్, డిగ్రీ వంటి సాధారణ కళాశాలల్లో చదివి ఒక్కసారిగా ఉన్నత విద్యా కోర్సులు అందించే కళాశాలల్లో చేరేసరికి గందరగోళంగా ఉంటుంది. ఎలాంటి గందరగోళానికీ తావు లేకుండా కాలేజీ క్యాంపస్ లైఫ్‌ను ఉత్సాహంగా ప్రారంభించాలంటే విద్యార్థులు కొన్ని వ్యక్తిగత నైపుణ్యాలను అలవరచుకోవాలి. వీటి సహాయంతో ఒత్తిడిని దరిదాపులకు రానీయకుండా కొత్త వాతావరణంలో త్వరగా, తేలిగ్గా ఇమిడిపోగలరు.
వ్యక్తిగత నైపుణ్యాలు తోడుగా:
కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టే సరికి వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ రకాల మనస్తత్వాలున్న విద్యార్థులు తారసపడతారు. వారందరితో కలిసిపోయి క్యాంపస్ జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించాలంటే వ్యక్తిగత లేదా లైఫ్ స్కిల్స్‌ను అలవరచుకోవాలి. వీటి కోసం ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. స్వతహాగా ప్రవర్తనా తీరును కొంత మార్చుకుంటే సరిపోతుంది.

- ఎదుటి వారు చెప్పిన విషయాలను జాగ్రత్తగా వినడం అనేది ఓ మంచి లైఫ్ స్కిల్. అలాంటప్పుడే వారి భావాలకు అనుగుణంగా మన అభిప్రాయాలను చక్కగా వ్యక్తపరచగలం. మన మాటలు ఎదుటివారిని ఆకట్టుకునేవిగా ఉండాలి.అనవసర పదాలు ఉపయోగించకూడదు.
- వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం పెంచేందుకు చిరునవ్వు ఉపయోగపడుతుంది. ముఖంపై చిరునవ్వును చెదరనివ్వని వారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించగలుగుతారు.
- ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సరిగా ఆలోచించకుండా బెంబేలెత్తిపోకూడదు. అసలు సమస్య ఏమిటి? సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలేమిటి? వంటి వాటిని అర్థం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది.
- సానుకూల దృక్పథం, ఎదుటి వారి గొప్పతనాన్ని అభినందించే గుణం, ఒత్తిడిని జయించడం వంటి స్కిల్స్‌ను పెంపొందించుకుంటే కాలేజీ క్యాంపస్ లైఫ్‌లో ఎదురే ఉండదు.
బిడియం వద్దు:
కాలేజీ క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో చేరిన కోర్సు, హాస్టల్, క్యాంపస్ క్లబ్‌లు, సౌకర్యాలు ఇలా వివిధ అంశాలకు సంబంధించి రకరకాల సందేహాలు వస్తాయి. వీటిని నివృత్తి చేసుకునేందుకు వెనకడుగు వేయకూడదు. బిడియం లేకుండా లెక్చరర్లు, సీనియర్లను సంప్రదించి తెలియని విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడే తేలిగ్గా కాలేజీ వాతావరణానికి అలవాటుపడగలరు. ఎవరో ఏదో అనుకుంటారని అనుమానాలను నివృత్తి చేసుకోకుండా ఉండిపోతే అవి దీర్ఘకాలంలో కెరీర్‌కు అడ్డంకులుగా మారతాయన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
స్నేహితుల విషయంలో జాగ్రత్త:
విద్యార్థి జీవితంలో చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా స్నేహితులే కారణం. అందువల్ల స్నేహితుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలి. పరిచయమైన ప్రతి ఒక్కరితోనూ మన వ్యక్తిగత వివరాలన్నింటినీ చెప్పకూడదు. ఎవరితో ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి. కాలేజీలో ఉన్న స్పోర్ట్స్ క్లబ్‌లు, సైన్స్ క్లబ్‌లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి వాటి గురించి తెలుసుకొని విద్యార్థులు తమకిష్టమైన వాటిలో చేరడం ద్వారా లీడర్‌షిప్, ప్రాబ్లం సాల్వింగ్ వంటి స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. ఇవి కాలేజీలో కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసేందుకు, ఆ తర్వాత మంచి కెరీర్‌లో స్థిరపడేందుకు ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు ఇచ్చే డబ్బును సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలోనూ, టైం మేనేజ్‌మెంట్‌లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేలా ఆహార్యం ఉండాలి. దీనికోసం స్వీయ డ్రెస్ కోడ్ పాటించడం మంచిది. కాలేజీలో అడుగుపెట్టిన తొలిరోజు నుంచి మొదలయ్యే డ్రెస్ కోడ్ ప్రాధాన్యత జాబ్ ఇంటర్వ్యూల వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదు. క్రమశిక్షణ అనేది గొప్ప అద్భుతాలకు బాటలు వేస్తుందన్న విషయాన్ని మరచిపోకూడదు.
కోర్సే కేంద్రంగా:
ఉన్నత విద్యా కోర్సుల్లో కరిక్యులం భిన్నంగా, లోతుగా ఉంటుంది. అందువల్ల కళాశాలలో అడుగుపెట్టిన తర్వాత రెండు, మూడు వారాలను మాత్రమే తోటి విద్యార్థులు, ఫ్యాకల్టీతో పరిచయాలకు కేటాయించాలి. తర్వాత దృష్టంతా చేరిన కోర్సుపైనే కేంద్రీకరించాలి. తొలుత కరిక్యులం మొత్తాన్ని పరిశీలించాలి. సీనియర్లు, ఫ్యాకల్టీ సహాయంతో అవగాహన పెంపొందించుకోవాలి. దీనివల్ల కోర్సుపై పట్టు సాధించేందుకు వీలవుతుంది.
కమ్యూనికేషన్ స్కిల్స్:
ఆలోచనల కూర్పు.. వినే ఓర్పు.. పలికే నేర్పుల సమాహారమే సంభాషణ. కోర్సును దిగ్విజయంగా పూర్తిచేయడానికి, తర్వాత కెరీర్‌లో సుస్థిర స్థానం సంపాదించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అకడమిక్ స్కిల్స్ బాగున్నా, సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కెరీర్‌లో వెనక వరుసలో ఉండాల్సి వస్తుంది. కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్థులేగాక సిటీ నేపథ్యంలో విద్యాభ్యాసం సాగించిన వారు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల కాలేజీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ స్కిల్స్ పెంపొందించుకోవడంపై దృష్టిసారించాలి. ఇంగ్లిష్ చానళ్లను వీక్షించడం, ఆంగ్ల దినపత్రికలను చదవడం చేయాలి. రైటింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచుకునే దిశగా కూడా విద్యార్థులు ప్రయత్నించాలి. ప్రొఫెషనల్ స్టడీస్‌లో మంచి అకడమిక్ రికార్డు సాధించడంలో ఈ రెండు స్కిల్స్ ప్రధానపాత్ర పోషిస్తాయి. కేస్ స్టడీలు రాయడం, ప్రాజెక్ట్ రిపోర్టులు రూపొందించడంలో రైటింగ్ స్కిల్స్ కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తరగతి గదిలో వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగపడతాయి.
పోటీతత్వం అవసరం:
విద్యార్థులు ఆహ్లాదకరమైన పోటీతత్వాన్ని అలవరచుకోవాలి. కాలేజీల్లో నిర్వహించే వివిధ పోటీల్లో పాల్గొనాలి. కోర్సు పూర్తయిన తర్వాత ఎదుర్కోబోయే పోటీ పరీక్షలకు అవసరమైన అంశాలను నేర్చుకోవాలి. జీకే, గ్రూప్ డిస్కషన్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ నాలెడ్జ్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. జాబ్ మార్కెట్‌లో వస్తున్న మార్పులను నిశితంగా పరిశీలించాలి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది ఎంతో అవసరం. విద్యార్థులు సంబంధిత కోర్సులతో ముడిపడిన మేగజైన్లను, పత్రికలను చదవాలి. దీనికి కాలేజీ లైబ్రరీని ఉపయోగించుకోవాలి.
మేనేజ్‌మెంట్ విద్యార్థులైతే.. అనలిటికల్ స్కిల్స్ పెంచుకోవడానికి కృషి చేయాలి. మార్కెట్లో లభించే పలు బిజినెస్ మేగజైన్లను చదవాలి. వాటిలో ప్రచురించే కేస్ స్టడీలను చదివితే బిజినెస్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, కెరీర్‌లో రాణించడానికి ఉపయోగపడే మార్గాలపై స్పష్టత ఏర్పడుతుంది.
------------------------------------------------------------------------
ఓ విద్యార్థి కాలేజీ జీవితాన్ని HOPE ఫార్ములాతో సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.
H: Honesty
విద్యార్థి జీవితంలో ముఖ్యమైనది నిజాయితీ. క్యాంపస్‌లో కాలు మోపిన దగ్గరి నుంచి నిజాయితీగా కష్టపడటం అలవర్చుకోవాలి. అప్పుడే కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విజయాలు ఆహ్వానం పలుకుతాయి.
O: Opportunities
కాలేజీ క్యాంపస్‌లో కెరీర్‌కు ఉపయోగపడే ఏ అవకాశాన్నీ విడిచిపెట్టకూడదు. పోటీ పరీక్షలో ఎంతో మందిని వెనక్కు నెట్టి మీరు సీటు కైవసం చేసుకుంటారు కాబట్టి అంది వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కోర్సును విజయవంతంగా పూర్తిచేసి ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవాలి.
P: Participation
కాలేజీలో వివిధ రకాల అకడమిక్, కల్చరల్ కార్యక్రమాలు జరుగుతాయి. వాటిలో తప్పనిసరిగా పాల్గొనాలి. దీనివల్ల లీడర్‌షిప్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అలవడతాయి. ఈ స్కిల్స్ ఉన్నత కెరీర్‌కు సోపానాలవుతాయి.
E: Excellence
కాలేజీలో చేరినప్పటి నుంచి కమ్యూనికేషన్, కంప్యూటర్ లిటరసీ స్కిల్స్, రీజనింగ్ ఎబిలిటీస్ వంటి వాటిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయాన్ని కైవసం చేసుకునేందుకు మొదటి నుంచి ప్రయత్నించాలి. అవసరమైతే అకడమిక్స్‌కు సమాంతరంగా అదనపు కోర్సులు చేయాలి.
-------------------------------------------------------------------------
ఆత్మస్థైర్యమే అసలు బలం..!
కష్టపడి చదివాం.. ‘సెట్’లో మంచి ర్యాంకు సాధించి కోరుకున్న కోర్సులో చేరిపోయాం.. ఇక సరదాగా కాలేజీ క్యాంపస్ లైఫ్‌ను లాగించేయొచ్చు! అనుకుంటే అక్కడితో కెరీర్ గ్రాఫ్‌కు దారులు మూసుకుపోయినట్లే! విద్యార్థులు గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇలా ఏ కోర్సులో సీటు సంపాదించినా కాలేజీలోకి అడుగుపెట్టిన తొలిరోజు నుంచే మంచి భవిష్యత్తు జీవితానికి పునాదులు వేసుకోవాలి. కాలేజీ తొలి రోజుల్లో అంతా కొత్తగా ఉంటుంది. ఇలాంటి సమయంలో టీచింగ్ స్టాఫ్ మార్గదర్శకత్వంతో క్యాంపస్ జీవితానికి అలవాటు పడాలి. చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చే దిశగా శ్రమించాలి. ఒకవైపు చేరిన కోర్సులో పట్టు సాధించేందుకు కృషి చేస్తూ, మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టిసారించాలి. ఉన్నత కెరీర్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను అలవరచుకోవాలి. కీలకమైన కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం పొందేందుకు ప్రయత్నించాలి. స్వీయ క్రమశిక్షణ గొప్ప అద్భుతాలకు బాటలు వేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకొని అందుకు అనుగుణంగా విద్యార్థులు కాలేజీ లైఫ్‌ను తీర్చిదిద్దుకోవాలి. ఆత్మస్థైర్యం, క్రమశిక్షణలను అలవరచుకొని నిజాయితీగా కష్టపడితే ఎలాంటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చనే వాస్తవాన్ని విద్యార్థులు గుర్తించాలి.
--------------------------------------------------------------------------
మానసికంగా సిద్ధం కావాలి
అమ్మానాన్నల సంరక్షణలో ఉన్న పిల్లలు చదువుల ప్రయాణంలో భాగంగా దూరప్రాంతంలో ఉండేందుకు ముందుగానే మానసికంగా సిద్ధమవాలి. అప్పుడే ఆత్మవిశ్వాసంతో కాలేజీ క్యాంపస్‌లోకి అడుగుపెట్టగలరు. కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. ఇతర రాష్ట్రాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు తొలుత అక్కడ తమ ప్రాంత విద్యార్థుల వివరాలు తెలుసుకోవాలి.
కళాశాల ప్రాంగణంలోకి వెళ్లేముందు కాలేజీ నిబంధనల గురించి, అక్కడ ఏర్పాట్ల గురించి సీనియర్లను అడిగి తెలుసుకోవాలి. మొదట్లోనే ముందుబెంచిలో కూర్చోవటం అలవాటు చేసుకుంటే మూడ్రోజుల్లోనే క్లాసురూం వాతావరణానికి అలవాటుపడతారు. కాలేజీలో విద్యార్థుల బాగోగులను పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉండే ‘మెంటర్’ వివరాలు తెలుసుకోండి. ఉత్తర భారతదేశంలో అయితే ఆహారపు అలవాట్లు ఇక్కడికి భిన్నంగా ఉంటాయి. అందువల్ల నెమ్మదిగా అలవాటుపడేందుకు ప్రయత్నించాలి. మొదటి నెల రోజులు అలవాటు కాగలిగితే కాలేజీ లైఫ్‌తో ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకున్నవారవుతారు.

Published date : 01 Aug 2013 05:37PM