Skip to main content

ఇంజనీరింగ్ కోర్సు.. కరిక్యులం.. విశ్లేషణ


ఎంసెట్ ర్యాంకుల ప్రకటనతో.. కౌన్సెలింగ్ హడావుడి ప్రారంభమైంది.. భావి ఇంజనీర్లుగా తమ కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించే ఘట్టంలో తొలి అడుగుగా నిలిచే ఇంజనీరింగ్ కోర్సుల్లో మరో కొన్ని రోజుల్లో ప్రవేశం పొందనున్నారు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఔత్సాహికులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్రంలోని మూడు ప్రముఖ యూనివర్సిటీలు.. జేఎన్‌టీయూ, ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్ కరిక్యులం ఏ విధంగా ఉంది? పరీక్షల విధానం ఏ విధంగా ఉంటుంది?
తదితర అంశాలపై విశ్లేషణ..

జేఎన్‌టీయూ - హైదరాబాద్

కనీస పనిదినాల సంఖ్య: సంవత్సరానికి-180 రోజులు, సెమిస్టర్‌కు-90 రోజులు.
ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్) కోర్సు నాలుగేళ్లు ఉంటుంది. కోర్సు స్వరూపం.. మొదటి సంవత్సరం ఈయర్ వైజ్‌గా ఉంటుంది. రెండో ఏడాది నుంచి సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు.
మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు సబ్జెక్ట్‌లు కామన్‌గా ఉంటాయి.

మొదటి సంవత్సరంలో సబ్జెక్టులు..
  • ఇంగ్లిష్
  • మ్యాథమెటిక్స్-1
  • ఇంజనీరింగ్ మెకానిక్స్
  • ఇంజనీరింగ్ ఫిజిక్స్
  • ఇంజనీరింగ్ కెమిస్ట్రీ
  • కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్
  • ఇంజనీరింగ్ డ్రాయింగ్
  • కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్
  • ఇంజనీరింగ్ ఫిజిక్స్-కెమిస్ట్రీ ల్యాబ్
  • ఇంగ్లిష్ ల్వాంగేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్
  • ఇంజనీరింగ్ వర్క్‌షాప్/ఐటీ వర్క్‌షాప్
బీటెక్ పట్టా పొందాలంటే.. అడ్మిషన్ తేదీ నుంచి నాలుగేళ్లకు తగ్గకుండా, ఎనిమిదేళ్లకు మించకుండా కోర్సును పూర్తి చేయాలి(లేని పక్షంలో సీటు రద్ద వుతుంది). అంతేకాకుండా 224 క్రెడిట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని సూచించిన విధంగా 216 క్రెడిట్స్ సాధించాలి.
ఏడాది చివర/సెమిస్టర్ చివర నిర్వహించే పరీక్షల్లో సబ్జెక్ట్‌ల వారీగా మూల్యాంకనం చేస్తారు. ఈ క్రమంలో థియరీకి 100 మార్కులు, ప్రాక్టికల్‌కు 75 మార్కులు ఉంటాయి. వీటికి అదనంగా ఇండస్ట్రీ ఓరియెంటెడ్ మినీ ప్రాజెక్ట్, సెమినార్, ప్రాజెక్ట్‌ను వరుసగా 50, 50, 200 మార్కులకు మూల్యాంకనం చేస్తారు.
థియరీ సబ్జెక్ట్‌లకు ఇంటర్నల్ ఎగ్జామ్‌లను 25 మార్కులకు, ఎండ్ ఎగ్జామ్‌లను 75 మార్కులకు మూల్యాంకనం చేస్తారు. మొదటి సంవత్సరంలో మూడు మిడ్ టర్మ్ ఎగ్జామ్‌లు, మూడు అసైన్‌మెంట్లు ఉంటాయి. ఒక్కో ఎగ్జామ్‌కు 25 మార్కులు. ప్రతి సెమిస్టర్‌లో రెండు మిడ్ ఎగ్జామ్‌లు ఉంటాయి.
ప్రతి మిడ్ ఎగ్జామ్‌లో ఒక ఆబ్జెక్టివ్ పేపర్ (10 మార్కులు),ఒక ఎస్సే పేపర్ (10 మార్కులు), ఒక అసైన్‌మెంట్(5 మార్కులు) ఉంటుంది. ఆబ్జెక్టివ్ పేపర్‌లో మల్టిపుల్ చాయిస్ కొశ్చన్‌‌స, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, మ్యాచింగ్ తరహా ప్రశ్నలు ఉంటాయి.ఎస్సే పేపర్‌లో పూర్తిస్థాయి ప్రశ్నలు నాలుగు వస్తాయి. వీటిల్లో రెండింటికి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు ఐదు మార్కులు. ప్రతి మిడ్ ఎగ్జామ్‌కు ముందు అసైన్‌మెంట్‌ను సమర్పించాలి.
{పాక్టికల్స్ విషయంలో మూల్యాంకనం నిరంతరం జరుగుతుంది. ఈ క్రమంలో 25 సెషనల్ మార్కులు, ఎండ్ ఎగ్జామ్‌లో 50 మార్కులు ఉంటాయి. 25 సెషనల్ మార్కుల్లో ల్యాబ్ వర్క్ కు 15 మార్కులు, ఇంటర్నల్ ఎగ్జామ్‌కు 10 మార్కులు కేటాయించారు. డిజైన్/డ్రాయింగ్ (ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, మెషిన్ డ్రాయింగ్) వంటి సబ్జెక్ట్‌ల విషయంలో ఇంటర్నల్ ఎవల్యూషన్‌కు 25 మార్కు లు (ప్రతి రోజూ వర్క్ కు 15 మార్కులు, ఇంటర్నల్ ఎగ్జామ్‌కు 10 మార్కులు), ఎండ్ ఎగ్జామ్‌కు 75 మార్కులు ఉంటాయి.
మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ తర్వాత వేసవి సెలవుల్లో ఇండస్ట్రీ ఓరియెంటెడ్ మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ ప్రాజెక్ట్‌వర్క్, సెమినార్ ప్రెజెంటేషన్, వైవా-వాయిస్ సెషన్ ఉంటాయి.
75 శాతం హాజరు ఉంటేనే యూనివర్సిటీ నిర్వహించే పరీక్షలకు అనుమతినిస్తారు. నిబంధనల మేరకు హాజరు శాతంలో 10 శాతం మినహాయి నిం పునిస్తారు.
హాజరు శాతం ఆధారంగా మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరానికి ప్రమోట్ చేస్తారు. రెండో సంవత్సరం నుంచి మూడో సంవత్సరానికి ప్రమోట్ కావాలంటే.. నిర్దేశించిన విధంగా 34 క్రెడిట్స్ పొంది ఉండాలి. మూడు నుంచి నాలుగో సంవత్సరానికి ప్రమోట్ కావాలంటే నిర్దేశించిన విధంగా 56 క్రెడిట్లు సాధించాలి.
థియరీ లేదా ప్రాక్టికల్ లేదా డ్రాయింగ్ సబ్జెక్ట్.. ఇలా ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 శాతం మార్కులు, మొత్తం మీద 40 శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణునిగా పరిగణిస్తారు.

ఆంధ్రా యూనివర్సిటీ
కనీస పనిదినాల సంఖ్య: సంవత్సరానికి-180 రోజులు, సెమిస్టర్‌కు-90 రోజులు.
ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్) కోర్సు నాలుగేళ్లు ఉంటుంది. కోర్సు స్వరూపం.. మొదటి సంవత్సరం ఈయర్ వైజ్‌గా ఉంటుంది. రెండో ఏడాది నుంచి సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు.
మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు సబ్జెక్ట్‌లు కామన్‌గా ఉంటాయి.

మొదటి సంవత్సరంలో సబ్జెక్టులు..
  • బేసిక్ సెన్సైస్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)
  • ఇంగ్లిష్
  • ఇంజనీరింగ్ గ్రాఫిక్స్
  • కంప్యూటర్ అప్లికేషన్స్
  • న్యూమరికల్ మెథడ్స్
  • వర్క్‌షాప్ ప్రాక్టీస్
తదితరాలు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఎథిక్స్-మోరల్స్‌పై ఒక సబ్జెక్ట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. స్పోర్ట్స్‌ను కూడా తప్పనిసరి చేశారు.
జాబ్ మార్కెట్‌కనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు మొదటి సంవత్సరంలో ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ను బోధిస్తారు. మూడో సంవత్సరంలో కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణనిస్తారు. చివరి సంవత్సరం విద్యార్థులకు మేనేజ్‌మెంట్ స్కిల్స్‌పై తర్ఫీదునిస్తారు. అంతేకాకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (టీఈక్యూఐపీ)లో భాగంగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు సంబంధించి ప్రొఫెషనల్స్‌తో శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తారు.
మూడో సంవత్సరం చివర వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్, చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది.
అకడెమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్‌లను నిర్వహిస్తారు. ఇంటర్నల్ ఎగ్జామ్‌లో థీయరీ పేపర్‌కు 30 శాతం మార్కులు, ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్‌లో 70 శాతం మార్కులు కేటాయిస్తారు. ప్రాక్టికల్‌లో ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్‌కు 50 శాతం చొప్పున మార్కులు ఉంటాయి.
ఇంజనీరింగ్ కోర్సు మూల్యాంకనం క్రెడిట్ సిస్టమ్ ఆధారంగా ఉంటుంది. ఈ క్రమంలో మొదటి సంవత్సరంలో 41 క్రెడిట్లు, మిగిలిన సంవత్సరాల్లో సెమిస్టర్ వారీగా బ్రాంచ్, ఈయర్‌ను అనుసరించి 26 నుంచి 28 క్రెడిట్లు కేటాయిస్తారు.
75 శాతం హాజరు ఉంటేనే మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరానికి ప్రమోట్ చేస్తారు.

సెమిస్టర్ వైజ్ ఈఈఈ బ్రాంచ్- సబ్జెక్ట్‌లు:
ద్వితీయ సంవత్సరం-మొదటి సెమిస్టర్: మ్యాథమెటిక్స్-3, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, నెట్‌వర్క్ థియరీ, ఎలక్ట్రోమాగ్నటిక్స్, ఎలక్ట్రానిక్ డివెజైస్ అండ్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్, నెట్‌వర్క్స్ అండ్ మెజర్‌మెంట్ ల్యాబ్, ఎలక్ట్రానిక్ డివెజైస్ అండ్ సర్క్యూట్స్ ల్యాబ్. రెండో సెమిస్టర్: మ్యాథమెటిక్స్-4, ఫర్ఫామెన్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్-1, అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, థర్మల్ ప్రైమ్ మూవర్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, థర్మల్ ప్రైమ్ మూవర్స్ ల్యాబ్, అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ల్యాబ్

మూడో సంవత్సరం-మొదటి సెమిస్టర్: పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, లీనియర్ ఐసీస్ అండ్ అప్లికేషన్స్, లాజిక్ డిజైన్ అండ్ మైక్రోప్రాసెసర్, ఫర్ఫామెన్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్-2, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్, ఫ్లుయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ, ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్-1, ఎల్. ఐసీఎస్ అండ్ పల్స్ సర్క్యూట్స్ ల్యాబ్, సాఫ్ట్ స్కిల్స్. రెండో సెమిస్టర్: కంట్రోల్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్ థియరీ, పవర్ ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అండ్ యూటీలైజేషన్, ఫర్ఫామెన్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్-3, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోప్రాసెసర్స్ ల్యా బ్,ఫ్లుయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ ల్యాబ్.

నాలుగో సంవత్సరం-మొదటి సెమిస్టర్: పవర్ సిస్టమ్ అనాలసిస్ అండ్ స్టెబిలిటీ, ఎలక్ట్రిక్ డివెజైస్ అండ్ ట్రాక్షన్, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్ కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్-2, ఇండస్ట్రియల్ ట్రైనింగ్. రెండో సెమిస్టర్: ఇంజనీరింగ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మేంట్, పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్, ఎలెక్టివ్-3, పవర్ సిస్టమ్ స్టిమ్యూలేషన్ ల్యాబ్, కంట్రోల్ సిస్టమ్ ల్యాబ్, ప్రాజెక్ట్ వర్క్.

ఉస్మానియా యూనివర్సిటీ

ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్) కోర్సు నాలుగేళ్లు ఉంటుంది. కోర్సు స్వరూపం.. మొదటి సంవత్సరం ఈయర్ వైజ్‌గా ఉంటుంది. రెండో ఏడాది నుంచి సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు.
మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు సబ్జెక్ట్‌లు కామన్‌గా ఉంటాయి.
మొదటి సంవత్సరంలో సబ్జెక్టులు..
  • ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్
  • ఇంజనీరింగ్ కెమిస్ట్రీ
  • ఇంజనీరింగ్ ఫిజిక్స్
  • కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్,
  • ఇంజనీరింగ్ మెకానిక్స్
  • ఇంజనీరింగ్ గ్రాఫిక్
  • ఇంజనీరింగ్ ఇంగ్లిష్
  • వర్క్‌షాప్స్, ల్యాబ్స్
ఇంజనీరింగ్ కోర్సులో 60 శాతం థియరీకి, 40 శాతం ప్రాక్టికల్స్‌కు వెయిటేజీ ఉంటుంది.
ఇంజనీరింగ్ రెండో సంవత్సరం నుంచి బ్రాంచ్ వారీగా సబ్జెక్ట్‌లు ఉంటాయి. రెండో సంవత్సరంలో సంబంధిత బ్రాంచ్‌పై ఫౌండేషన్ సబ్జెక్ట్‌లు, మూడో సంవత్సరంలో విస్తృత పరిధిలో ఫౌండేషన్ సబ్జెక్ట్‌లకు చోటు కల్పించారు. నాలుగో సంవత్సరంలో అడ్వాన్స్‌డ్ సబ్జెక్ట్స్, ఇటీవలి కాలంలో వచ్చిన నూతన టెక్నాలజీలు, ఎలెక్టివ్స్ (ఆప్షన్‌‌స) వంటి అంశాలు ఉంటాయి.
బీటెక్/బీఈ కోర్సును అడ్మిషన్ తేదీ నుంచి ఎనిమిదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే అడ్మిషన్ రద్దవుతుంది.
కనీస పని దినాలు సంవత్సరానికి 32 వారాలు. సెమిస్టర్‌కు 16 వారాలు.
తరగతులు ప్రారంభమైన ఏడు వారాలకు మొదటి ఇంటర్నల్ ఎగ్జామ్, 15 వారాలకు రెండో ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
సెమిస్టర్‌కు రెండు ఇంటర్నల్ ఎగ్జామ్స్, రెండు అసైన్‌మెంట్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్‌కు 25 మార్కులు, ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్‌కు 75 మార్కులు కేటాయించారు. ఇంటర్నల్ ఎగ్జామ్‌లో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు భాగాలు ఉంటాయి. వీటిల్లో విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించే విధంగా షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్, లాంగ్ ఆనర్స్ కొశ్చన్స్‌కు చోటు కల్పించారు.
పరీక్షలకు హాజరుకావాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి.
ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి ప్రమోట్ కావాలంటే.. ఆ సంవత్సరంలో ఉన్న సబ్జెక్ట్‌ల్లో 50 శాతం సబ్జెక్ట్‌ల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.
నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో ప్రాజెక్ట్‌వర్క్ ఉంటుంది.
Published date : 04 Jul 2013 12:03PM

Photo Stories